మాధవిలతకు చేదు అనుభవం.. కరపత్రం ఇస్తుండగా నెట్టేసిన మహిళ?

praveen
ప్రస్తుతం తెలంగాణలో ఎక్కడ చూసినా పార్లమెంట్ ఎన్నికల హడావిడిగా కనిపిస్తుంది. అన్ని పార్టీలు గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. అయితే కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు అటు ఎంఐఎం కంచుకోట అయిన హైదరాబాద్లో విజయం పై ఆశలు వదులుకున్నాయ్ అనే వాదన ఉంది. ఒక్క బీజేపీ మాత్రం మజిలీస్ కంచుకోటని బద్దలు కొట్టి కాషాయ జండా ఎగరవేయాలని పట్టుతో ఉంది  ఈ క్రమంలోనే అక్కడ మాధవి లతను బరిలోకి దింపింది అన్న విషయం తెలిసిందే. అయితే బిజెపి తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేసేలా ఆమె ప్రచార రంగంలో దూసుకుపోతున్నారు. తనను గెలిపిస్తే ఏం చేస్తాను అనే విషయంపై స్పష్టమైన హామీలను ఇస్తున్నారు.

 ఎంఐఎం పాలనలో ముస్లిం మహిళలందరికీ అన్యాయం జరిగిందని తనను గెలిపిస్తే అందరికీ న్యాయం జరిగేలా చూస్తాను అంటూ హామీ ఇస్తున్నారు మాధవి లత. ఈ క్రమంలోనే ఇంటింటికి తిరుగుతూ ముమ్మర ప్రచారం చేస్తున్నారు అని చెప్పాలి. అయితే ఇక మాధవి లత ప్రచారం చూస్తూ ఉంటే ఎంఐఎం పార్టీకి భయం పట్టుకుందని కొంతమంది బిజెపి నేతలు కూడా చెబుతూ ఉన్నారు. కానీ ఇక పరిస్థితులు చూసుకుంటే మరోలా ఉన్నాయి అనేదానికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారిపోయింది. ఇటీవల ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ఓటర్లకు కరపత్రం ఇస్తూ ఓటు వేయాలని మాధవి లత అభ్యర్థిస్తూ ప్రచారం చేశారు.

 ఇలాంటి సమయంలోనే ఒక మహిళా ఓటర్ నుంచి మాధవి లతకు ఊహించిన రీతిలో చేదు అనుభవం ఎదురయింది. ఏకంగా తనకే ఓటు వేయాలంటూ మాధవి లత కరపత్రం ఇస్తూ అభ్యర్థిస్తుండగా.. ఆ మహిళ కరపత్రం తీసుకోకుండా బీజేపీ అభ్యర్థి మాధవి లతను తోసేసింది. దీంతో ఆగ్రహానికి గురైన మాధవి లత వీడియో ఎందుకు తీస్తున్నావ్ అంటూ ఓ వ్యక్తిపై మండిపడింది. దీంతో ఈ వీడియో ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఎంఐఎం కంచుకోటగా ఉన్న హైదరాబాదులో బిజెపిని ప్రజలు వద్దు అనుకుంటున్నారా? లేదంటే అక్కడ జరిగింది ఒకటైతే మరొకటి ప్రచారం చేస్తున్నారా అనే విషయంపై చర్చ జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: