ఏపీ:టిడిపికి కూటమే శత్రువైందా.?

Pandrala Sravanthi
శత్రువులు ఎక్కడో ఉండరు మన చుట్టుపక్కలే ఉంటారు  అనే సామెతకు నిదర్శనం  ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి టిడిపి కూటమి పరిస్థితి. ఎలాగైనా జగన్ ను గద్దె దించాలని చంద్రబాబు ఎన్నో కుయుక్తులు పన్ని, బిజెపి, జనసేనతో కలిసి కూటమి ఏర్పాటు చేశాడు. ఇదే తరుణంలో బిజెపికి పది అసెంబ్లీ సీట్లు జనసేనకు 20వ అసెంబ్లీ సీట్లు కేటాయించాడు. ఇక పార్లమెంటు విషయానికి వస్తే బిజెపికి ఆరు జనసేనకు రెండు పార్లమెంట్ సీట్లను కేటాయించారు.  ఇదే తరుణంలో 144 నియోజకవర్గాల్లో 17 పార్లమెంటు స్థానాల్లో టిడిపి పార్టీ మాత్రమే పోటీ చేస్తుంది. 

ఈ నియోజకవర్గాల్లో బీజేపీ, జనసేన ఓట్లు టిడిపికే పడతాయని చంద్రబాబు భావించారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది.  జనసేన, బిజెపిలకు కేటాయించిన సీట్లలో చాలావరకు టిడిపి క్యాండిడేట్లు ఎదురు తిరుగుతున్నారు. సపోర్టు ఇవ్వడం పక్కన పెడితే రెబల్స్ గా కూడా బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఆయనకు కూటమిలోని  వ్యక్తులే శత్రువులుగా మారారని చెప్పవచ్చు. తాజాగా  అనపర్తి సీటును కూటమిలో భాగంగా బిజెపికి ఇచ్చారు. కానీ టిడిపి నుంచి నల్లమిల్లి భార్య లక్ష్మీ వెళ్లి నామినేషన్ వేసింది. ఇక అంతే కాకుండా ఉండిలో తెలుగుదేశం నుంచి రెబల్ అభ్యర్థిగా శివరామకృష్ణ నామినేషన్ వేశారు. అంతేకాకుండా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు పలు ప్రాంతాలు ఎదురు తిరుగుతున్నట్టు తెలుస్తోంది.

అందులో అరకు ఒకరు నామినేషన్ వేశారట, అలాగే పాతపట్నం,  అనపర్తి, నంద్యాల నియోజకవర్గంలో కూడా రెబల్స్ గా నామినేషన్ వేసినట్టు తెలుస్తోంది. ఈ విధంగా తెలుగుదేశం వాళ్ళు  బిజెపి మీద వ్యతిరేకంగా, బిజెపి వాళ్లు  తెలుగుదేశం, జనసేనకు వ్యతిరేకంగా రెబల్స్ గా బరిలోకి దిగడం  చంద్రబాబుకు మింగుడు పడడం లేదు.  నామినేషన్లు మొదలైన మొదటి రోజే ఈ విధంగా ఉంటే, రేపు రేపు ఎన్ని వ్యతిరేకతలు వస్తాయో ఎంతమంది రెబల్స్ బరిలోకి దిగుతారు చెప్పడం కష్టంగా మారింది. ఒకవేళ రెబల్ అభ్యర్థులను చంద్రబాబు బుజ్జగించకపోతే మాత్రం తప్పక ఓటమిపాలవుతారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: