అప్పటివరకు మంచి స్నేహితులే.. కొడాలి నాని, ఎన్టీఆర్ మధ్య గ్యాప్ కు కారణాలివే!

Reddy P Rajasekhar
వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకప్పుడు మంచి స్నేహితులు అనే సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ నటించిన పలు సినిమాలకు కొడాలి నాని నిర్మాతగా కూడా వ్యవహరించారు. అయితే ఇప్పుడు మాత్రం తారక్, కొడాలి నాని మధ్య గ్యాప్ ఉందని ఆ గ్యాప్ ఎంతలా అంటే వాళ్లిద్దరి మధ్య ఇప్పుడు అసలు టచ్ లో కూడా లేరని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలో, కొడాలి నాని వైసీపీలో ఉండటమే ఈ గ్యాప్ కు కారణమని సమాచారం అందుతోంది.
 
వాస్తవానికి జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ పరంగా సక్సెస్ కావడంలో కొడాలి నాని పాత్ర ఎంతో ఉంది. కెరీర్ తొలినాళ్లలో ఎన్టీఆర్ కు కథల ఎంపికలో, దర్శకుల ఎంపికలో కొడాలి నాని సహాయం చేశారు. జూనియర్ ఎన్టీఆర్ మాస్ హీరోగా గుర్తింపును సంపాదించుకోవడంలో కొడాలి నాని పాత్ర ఎంతో ఉంది. జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొన్నా పాల్గొనకపోయినా తన చివరి శ్వాస వరకు టీడీపీలోనే ఉంటానని ఆయన చెప్పారు.
 
కొడాలి నాని రాజకీయాల్లో సక్సెస్ కావడంలో జూనియర్ ఎన్టీఆర్ పాత్ర కొంతమేర ఉంది. జూనియర్ ఎన్టీఆర్ వల్లే కొడాలి నానికి టీడీపీ నుంచి 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కింది. టీడీపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి నాని 2012 సంవత్సరంలో వైసీపీలో చేరారు. 2014, 2019 ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున పోటీ చేసి ఆయన గెలిచారు.
 
అయితే జూనియర్ ఎన్టీఆర్, కొడాలి నాని మధ్య గ్యాప్ కు ఒక ల్యాండ్ ఇష్యూ కారణమని చింతమనేని ప్రభాకర్ కొన్నిరోజుల క్రితం చేసిన ఆరోపణలు హాట్ టాపిక్ అయ్యాయి. టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ దూరం కాలేదని నాని, వంశీ టీడీపీకి తారక్ ను దూరం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారని ఆయన కామెంట్లు చేయడం జరిగింది. అయితే జూనియర్ ఎన్టీఆర్ సైలెన్స్ ను బ్రేక్ చేసే వరకు ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు దొరికే ఛాన్స్ అయితే లేదని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: