నోటుకు ఓటే కాదు.. నోటుకు సర్వే కూడా..!

Divya
ఈ మధ్యకాలంలో రాజకీయ పార్టీల నుంచి పలు రకాల సర్వేలు రోజురోజుకి పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. అయితే ఇదంతా కేవలం డబ్బు కోసమే చేస్తున్న సర్వేలు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.. ముఖ్యంగా ఇలాంటి విషయంలో కాస్త రాజకీయ ఆలోచన ఉన్నవారికి ఏ సర్వే ఎవరికీ ఫేవర్ గా ఉన్నది అనే విషయం అర్థమవుతుంది.. ఒకవేళ ఏదైనా సర్వేను చూసి ఇది నిజం అనుకుంటే అది పొరపాటే.. అయితే సర్వేలన్నీ ఒక అవగాహనకు సమగ్రమైన అంచనాలు సర్వేలో బాగా ఉపయోగపడతాయి.

సర్వేలు కేవలం ప్రజల మూడ్ ఎలా ఉంది ఏదైనా తప్పులు ఉంటే సరిదిద్దుకొనే అవకాశంతో పాటు సెట్ రైట్ చేసుకునేందుకు కూడా ఆస్కారం ఉంటుంది ఈ సర్వేల ఫలితాల వల్ల.. కానీ ప్రస్తుతం ఉన్న సర్వేలన్నీ కూడా తప్పుదావ పట్టిస్తూ తమకు అనుకూలంగా చేయించుకుంటున్నారనే వాదన అన్ని పార్టీల నుంచి వెలుబడుతోంది. కేవలం ప్రజలను మభ్యపెడుతూ వదులుతున్న ఈ సర్వేల వల్ల లాభం కంటే చాలా నష్టమే కనిపిస్తోందట. చాలామంది ఈ సర్వేలనే వ్యాపారంగా చేసుకుంటున్నారు. వారు చేస్తున్న విధానం ఏంటి తీసుకుంటున్న శాంపుల్ ఏంటి అనేది కూడా ఎవరికీ తెలియడం లేదు.

కేవలం కాకి లెక్కలు చెబుతూ.. ఏ పార్టీకి అనుకూలంగా ఆ పార్టీకే పాట పాడుతూ ఉన్నారు.. దీనివల్ల ఎన్నో పార్టీలు కూడా బొక్క బోర్లా పడుతున్నాయి. ఇదంతా ఇలా ఉంటే ఆంధ్రాలో చూస్తే సర్వేల కథ కూడా పోటాపోటీ గానే ఉన్నది. ప్రస్తుతం సర్వేలన్నీ చూస్తే ఫేక్ అనేంతలా జనం మూడ్ మారిపోతుంది. భారీ నెంబర్లు వేసి పలానా పార్టీ గెలుస్తుంది అంటూ వన్ సైడ్ గా చెప్పేస్తున్న సర్వేలను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా జాతీయ సంస్థలు కూడా ఇలాగే చేస్తున్నాయి. కేవలం డబ్బుకు పలుకు బడికి లొంగిపోయి ఇలాంటి సర్వేలు ఇస్తున్నాయంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా ఎవరితో బిజినెస్ బాండింగ్ ఉంటే కచ్చితంగా వారికి అనుకూలంగానే సర్వేలు చేసి ఇవ్వడం చాలా అలవాటుగా మారిపోయింది. ముఖ్యంగా ఈ మధ్య సోషల్ మీడియాలో మరింత సర్వేలు వైరల్ గానే మారుతున్నాయి. అయితే వీటన్నిటిని విద్యావంతులు, కానీ టీవీలు చూసేవారు మాత్రం కాస్త నమ్మడం లేదు.. కేవలం గ్రౌండ్ రియల్టిస్ అనేది అక్కడ ఉన్న ఓటర్లకు మాత్రమే తెలుస్తుందని చెప్పవచ్చు. అలాగే మరి కొంతమంది రాజకీయ నాయకులు జనంలోకి వచ్చినప్పుడు అక్కడ వచ్చే స్పందన వల్ల కూడా కాస్త మేర అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి సర్వేలు చెప్పే అంకెల గారడీతో ఇచ్చే సర్వేలను నమ్ముకుంటే మాత్రం నిండా మునగడమే ఖాయమని రాజకీయ విశ్లేషకులు తెలుపుతున్నారు. చాలామంది రాజకీయ నాయకులు ఓట్లకు కూడా నోట్లు పంచుతుంటే ఇప్పుడు సర్వేలకు కూడా నోట్లు పంచుతున్నారని వాదన వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: