టీవీ: సంచలన వ్యాఖ్యలు చేసిన వనిత విజయ్ కుమార్ కూతురు..!

Divya
ఎవరైనా సరే పాపులర్ కావాలి అంటే కచ్చితంగా సోషల్ మీడియా వల్లే పాపులర్ అవుతారని చెప్పవచ్చు.. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలంటే సోషల్ మీడియాలో పాపులర్ అయిన తర్వాతే ఎంట్రీ ఇస్తూ ఉంటారు.. ఇప్పుడు తాజాగా ప్రముఖ నటీ వనిత విజయ్ కుమార్ కూతురు జోవికా కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తోంది.. ముఖ్యంగా వనిత విజయ్ కుమార్ కూతురు స్టార్ కిడ్ అనే పేరుతో చాలా దారుణంగా ట్రోల్ కి గురైందట. అయినా కూడా వీటికి భయపడేమని తల్లి కూతుర్లు తెలియజేస్తున్నారు.

ముఖ్యంగా ఎలాంటి సమస్యనైనా సరే తమ పవర్ తోనే ఎదుర్కొంటామని తెలియజేస్తున్నారు.. వనిత విజయ్ కుమార్ గతంలో మూడు పెళ్లిళ్లు చేసుకున్నప్పటికీ ఆమె కెరియర్ని నిలబెట్టుకోవడానికి.. కూతురు కెరీర్ని నిలబెట్టడానికి  పలు రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంది.. ఈమె కూతురు జోవికా కెరియర్ మొదటి నుంచి నెగిటివిటీ ఎక్కువగా ఫేస్ చేస్తోంది. అయినా కూడా వీటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదంటు డైరెక్ట్ గానే ముఖం మీద చెప్పేస్తోంది. తాను ఎవరిని మోసం చేయలేదు.. ఎవరి డబ్బు తీసుకోలేదు.. కేవలం నటన తన బ్లడ్ లోనే ఉందంటూ తెలుపుతోంది.

ముఖ్యంగా తన తల్లి, తన అమ్మమ్మ, తాతయ్య అందరూ కూడా నటులేనని అందువల్లే తనకు అవకాశం ఎక్కువగా వస్తున్నాయి.. కానీ తన సొంత టాలెంట్ ని నమ్ముకున్నాను అంటూ తెలియజేసింది.. ముఖ్యంగా తన తల్లి పైన నెగెటివిటీ వచ్చిన అసలు పట్టించుకోమని తన గురించి తన తల్లి గురించి తమకు బాగా తెలుసు అని తెలుపుతోంది. కేవలం తమ కెరియర్ పైన ఎక్కువగా ఫోకస్ పెడుతున్నామని వెల్లడించింది. ఎక్కువమంది తన తల్లి వల్లే తన జీవితం పాడవుతుంది అంటూ అనుకుంటూ ఉంటారు.. కానీ అవన్నీ వట్టి మాటలే.. మా అమ్మే తనను సపోర్టు బాగా చేస్తోందని అయినప్పటికీ ఇద్దరిని కలిపి కూడా ట్రోలో చేస్తున్నారని అయినా కూడా భయపడము అంటూ గట్టిగా సవాల్ విసురుతోంది. జోవికా..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: