ఏపీ: ఆ 4స్థానాల్లో టీడీపీ అభ్యర్థుల మార్పు. ఆ మాజీ మంత్రికి ఛాన్స్..!

Pandrala Sravanthi
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి.  ఇంకా 24 రోజుల్లో జరగబోతున్న తరుణంలో అభ్యర్థులు ప్రచారంలో స్పీడును పెంచారు.  ఇప్పటికే మొత్తం 175 నియోజకవర్గాల్లో ఏకధాటిగా అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతోంది వైసిపి పార్టీ. కానీ కూటమిలో మాత్రం కుమ్ములాటలు ఆగడం లేదు. పొత్తు అనేది చంద్రబాబు నెత్తికి పెద్ద తలనొప్పిగా మారింది. అభ్యర్థుల మధ్య వైశాల్యాలను పెంచింది. ఓవైపు వైసీపీ అభ్యర్థులు నామినేషన్ల కోసం సిద్ధమవుతూ ఉంటే  టిడిపి కూటం మాత్రం ఇంకా అభ్యర్థులను  మార్చే పనిలోనే ఉంది. తాజాగా ఈ కూటమి నుంచి  ప్రకటించినటువంటి ఆ నలుగురు అభ్యర్థులను మార్చే అవకాశం ఉందట. మరి వారి ప్లేస్ లో ఎవరు వస్తున్నారు అనేది చూద్దాం. నరసాపురం సిట్టింగ్ ఎంపీ  రఘురామకృష్ణం రాజును అదే జిల్లా పరిధిలో ఉండే అసెంబ్లీ స్థానం నుంచి  టిడిపి అభ్యర్థిగా ప్రకటించబోతున్నట్టు ఒక సమాచారం అందుతుంది. 

అయితే ఈయన ముందుగా నరసాపురం  అసెంబ్లీ సీటు ఇవ్వాలని చంద్రబాబు ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోవడంతో ఆయనను ఉండి అసెంబ్లీ స్థానంలో పోటీ చేయించాలని చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా  సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజును ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమించాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇక దీంతో పాటు  అనకాపల్లి జిల్లాల పరిధిలోని మాడుగులలో  కూడా టిడిపి తమ అభ్యర్థిని చేంజ్ చేస్తుందట. ఈ స్థానంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి టికెట్ దాదాపు ఓకే అయినట్టు సమాచారం.  అయితే ఈ స్థానంలో అంతకుముందు ఎన్నారై పైల ప్రసాద్ రావును ప్రకటించారు. కానీ ఆయన ప్రచారంలో వెనుక పడ్డారని నివేదికలు టిడిపి అధిష్టానానికి అందడంతో చేంజ్ చేయాలని ఆలోచన చేస్తున్నారట. వీళ్ళే కాకుండా అన్నమయ్య జిల్లా పరిది లోని తంబళ్లపల్లె అభ్యర్థి జయచంద్ర రెడ్డి ని కూడా మారుస్తున్నట్టు సమాచారం. ఈయన కూడా ప్రజాదారణ పొందడంలో వెనుకబడిపోయారట.

అంతే కాకుండా ఈయనకు ప్రత్యర్థిగా ఉన్న వారితో  వ్యాపార సంబంధాలు ఉన్నాయనే ఒక ప్రచారం జోరుగా సాగుతోంది.  దీంతో ఈయన్ని కూడా మార్చేసి ప్రత్యామ్నాయంగా మదనపల్లి మాజీ ఎమ్మెల్యే దోమలపాటి రమేష్ భార్య సరళ రెడ్డి,  కొండా నరేంద్ర శంకర్ యాదవ్ పేర్లను ప్రకటించే అవకాశం ఉందన్నట్టు సమాచారం. అంతేకాకుండా సత్యసాయి జిల్లాలోని మడకశిర ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంలో అనిల్ కుమార్ ను టిడిపి ప్రకటించింది. దీంతో మాజీ ఎమ్మెల్సీ తిప్పే స్వామి వర్గం గట్టిగా వ్యతిరేకం చూపిస్తున్నారు.  దీంతో ఆయనను మార్చి దళిత విభాగం రాష్ట్ర ప్రెసిడెంట్ ఎమ్మెస్ రాజుకి ఇవ్వనున్నట్టు సమాచారం. ఇంకా వీళ్లే కాకుండా  ఏలూరు జిల్లాలోని దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గం లో కూడా మార్పు ఉండబోతున్నట్టు తెలుస్తోంది . ఇక్కడే కాకుండా కడప జిల్లా కమలాపురం తిరుపతి జిల్లా వెంకటగిరిలో  పార్టీ ఇన్చార్జిలకు బదులుగా వారి యొక్క వారసులని అభ్యర్థులుగా ప్రకటించారు.  కానీ వారు ప్రచారంలో వెనుకబడ్డారని నివేదికలు రావడంతో తిరిగి తండ్రులని పోటీకి దించేందుకు అధిష్టానం ఆలోచన చేస్తున్నట్టు సమాచారం.  ఇది పూర్తిగా తెలియాలి అంటే ఈ ఆదివారం 21న బీఫారాలు పంపిణీ చేయనుంది. అప్పుడు ఎవరికైతే బీఫారం అందుతుందో వారే ఫైనల్ అభ్యర్థి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: