ప‌వ‌న్ క‌ళ్యాణ్ పిఠాపురం కాక‌.. విదేశాల దాకా...!

RAMAKRISHNA S.S.
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో తాజా అప్డేట్ ఏంటి?  గీత గెలుస్తుందాటావా?  ఎలా ప్ర‌చారం చేస్తున్నారు? - ఇదీ.. పిఠాపురం గురించి స్థానికంగానే కాదు.. దేశ విదే శాల్లో ఉన్న ఏపీకి చెందిన వారు ఆరా తీస్తున్న ప్ర‌శ్న‌లు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పిఠాపురం నుంచి పోటీ చేయ‌డం ఎప్పుడైతే.. ఖాయ‌మైందో.. అప్పుడే పిఠాపురం పేరు అంత‌ర్జాతీయ స్థాయిలో మార్మోగింది. అప్ప‌ట్లోనే చాలా మంది సంఘీభావం తెలుపుతూ.. అమెరికా, దుబాయ్‌ల‌లో యాత్ర‌లు చేశారు.
ఇక‌, ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గంలో ప‌రిస్థితి ఎలా ఉంద‌నే విష‌యంపై నిత్యం ఆరాతీస్తున్నారు. దీంతో పిఠాపు రం సంగ‌తులు.. అని నెట్‌లో కొట్ట‌గానే తాజా స‌మార‌మే కళ్ల ముందు క‌నిపిస్తోంది. జ‌న‌సేన‌కు చెందిన ఎన్నారైలు కొంద‌రు ప్ర‌త్యేకంగా పిఠాపురం పేరుతో ఒక సైట్ ఓపెన్ చేసి.. ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌కు ప్రాధా న్యం ఇస్తున్నారు. మ‌రికొంద‌రు.. ఎప్ప‌టి స‌మాచారం అప్పుడే అందులో పొందు ప‌రుస్తున్నారు. అంతేకా దు.. ప‌వ‌న్ ప్ర‌సంగాల‌ను కూడాజోడిస్తున్నారు.
ఇలా.. పిఠాపురంలో జ‌రుగుతున్న ప్ర‌తి విష‌యం కూడా ఆస‌క్తిగా విదేశాల్లో ఉన్న తెలుగు వారు పంచుకో వ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, తాజా ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. వైసీపీ నాయ‌కురాలు ఎంపీ వంగా గీత దూకుడుగానే ఉన్నారు. మ‌హిళ‌ల్లో ఆమె సెంటిమెంటుగా మారారు. పిఠాపురం మండ‌లంలో ఆమె గ‌త నాలుగు రోజులుగా ప్ర‌చారం చేయ‌గా.. అక్క‌డి మ‌హిళ‌లు పెట్టిన చీర‌లు.. ఆటోలో త‌ర‌లించారంటే ఆశ్చ‌ర్యం వేస్తుంది. ప్ర‌తి ఒక్క‌రూ ఆమెకు హార‌తులు ప‌డుతున్నారు.
దీనికి కార‌ణం ప్ర‌భుత్వం ఇస్తున్న సంక్షేమ ప‌థ‌కాలు కాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. గ‌తంలో గీత ఇక్క‌డ చేసిన అభివృద్ధితోపాటు.. మ‌హిళ‌ల ర‌క్ష‌ణ విష‌యాన్ని కేంద్రంలో ప్ర‌స్తావించి(పార్ల‌మెంటు) ప్రత్యేక చ‌ర్చ జ‌రిగేలా చూశారు. దీనిని ఉద్యోగినులు గుర్తు చేస్తున్నారు. ఇక‌, ఇక్క‌డే ఉంటార‌న్న విశ్వాసం ఎక్కువ‌గా ఉంది. ప‌వ‌న్ విష‌యానికి వ‌స్తే.. మ‌ధ్య‌త‌ర‌గ‌తి క‌న్నా.. యువ‌తలో ఎక్కుడా ఇంపాక్ట్ ఉంది. కానీ, ఇది ఏమేర‌కు పోలింగ్ బూత్ వ‌ర‌కు వ‌స్తుంది?  అస‌లు ఎంత మందికి ఓటు ఉంది అనేది ప్ర‌శ్న‌.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: