కూటమిని ముంచేయబోతున్న క్రాస్ ఓటింగ్.. గుర్తుల కన్ఫ్యూజన్ తో ఇబ్బందేనా?

Reddy P Rajasekhar
ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తుండటం ఒక విధంగా ఆ పార్టీలకు మేలు చేస్తుండగా మరో విధంగా మాత్రం ఈ పార్టీలకు భారీ స్థాయిలో నష్టం కలిగే అవకాశాలు కూడా ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కూటమిని క్రాస్ ఓటింగ్ ముంచేయబోతుందని పొలిటికల్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు పోటీ చేస్తున్న స్థానాలలో తమ గుర్తులను ప్రచారం చేయడంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
 
ఒక లోక్ సభ పరిధిలో మూడు పార్టీలు పోటీ చేస్తే ఈ ఇబ్బంది మరింత ఎక్కువవుతోంది. జనసేన గాజుగ్లాస్ గుర్తు, బీజేపీ కమలం గుర్తు ప్రజలకు పెద్దగా పరిచయం లేని గుర్తులు కావడంతో గుర్తుల కన్ఫ్యూజన్ తో ఇబ్బందేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ, జనసేనలకు లోకల్ లీడర్స్ లేకపోవడం కూడా ఆ పార్టీలకు ఒకింత మైనస్ అవుతోందని ప్రచారం జరుగుతుండటం గమనార్హం.
 
ఒకే తేదీన అటు అసెంబ్లీ ఎన్నికలు ఇటు లోక్ సభ ఎన్నికలు జరుగుతుండటం కూడా కూటమికి తలనొప్పిగా మారిందని సమాచారం అందుతోంది. చంద్రబాబు, పవన్, బీజేపీ నుంచి పోటీ చేసే ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు ఆస్కారం లేకుండా అడుగులు వేస్తే మెరుగైన ఫలితాలు పొందే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. కూటమికి చేటు చేస్తున్న అంశాలపై ప్రధాన పార్టీల నేతలు దృష్టి పెట్టకపోతే ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత బాధ పడినా ప్రయోజనం ఉండదు.
 
మరోవైపు కూటమి ప్రచారం చేసే పద్ధతిని మార్చాల్సి ఉందని అలా చేస్తే మాత్రమే ఫలితాలు ఆశించిన స్థాయిలో ఉంటాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు జగన్ పై రాయి దాడి కేసులో టీడీపీ నేతల ప్రమేయం ఉందనే ఆరోపణలు కూటమికి తీరని నష్టం కలిగిస్తున్నాయి. రిమాండ్ రిపోర్ట్ లో జగన్ ను చంపేయడానికి కుట్ర జరుగుతోందని పేర్కొనడం హాట్ టాపిక్ అవుతోంది. వివేకా హత్య మీద మాట్లాడొద్దని కోర్టు ఆదేశాలు జారీ చేయడం కూడా కూటమికి మైనస్ అవుతోందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: