ఓటర్ల నాడిని చెప్పిన మరో సర్వే.. ఏపీలో ఆ పార్టీదే గెలుపు?

Suma Kallamadi
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు రోజురోజుకు ఉత్కంఠగా మారుతున్నాయి. ఇక సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ ఏపీలో విడుదల అయింది. దీంతో నామినేషన్లను నేతలు సమర్పించడం ప్రారంభిస్తున్నారు. మే 11 వరకు ఎన్నికల ప్రచారంలో నేతలు నిమగ్నం కానున్నారు. మే 13న పోలింగ్ జరగనుంది. ఎన్నికల నిబంధనల ప్రకారం ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం అమల్లోకి రానుంది. దీంతో ఇక నుంచి ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయకూడదు. ఈ తరుణంలో ఇప్పటి వరకు విడుదలైన పలు పోల్ సంస్థలు ప్రజల నాడిని పట్టామంటూ చెప్పాయి. చివరిగా మరో ఎగ్జిట్ పోల్ సంస్థ తమ ఫలితాలను విడుదల చేసింది. దీనిలో ఏ పార్టీ అధికారం చేపట్టనుందో ఆ ఎగ్జిట్ పోల్ సంస్థ తమ అంచనాలను వెల్లడించింది. దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.
జాతీయ స్థాయి సంస్థల నుంచి రాష్ట్ర స్థాయి సంస్థలు, మీడియా సంస్థలు, యూట్యూబ్ చానళ్లు ఇలా ఎగ్జిట్ పోల్స్ విషయంలో చాలా సంస్థలు తమ సర్వే ఫలితాలను వెల్లడించాయి. ఒక ఏడాది ముందు వరకు ఈ ఫలితాలు ఒకలా ఉంటే, ఎన్నికల సమయం దగ్గర పడే కొద్దీ ఫలితాలు మారుతూ వచ్చాయి. ఇదే కోవలే ఏపీలో పోల్ పల్స్ అనే సంస్థ తాము చేపట్టిన సర్వే ఫలితాలను తాజాగా వెల్లడించింది. తమ సర్వేకు సంబంధించి మొత్తం 25 పేజీల రిపోర్టును విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ వర్గాల ప్రజలు, ఓటర్ల అభిప్రాయాలను ఆ సంస్థ సర్వే చేసింది. వీటన్నింటినీ బేరీజు వేసుకుని ఏ ప్రాంతంలో ఏ పార్టీకి పట్టుందో, ఏ పార్టీ విజయావకాశాలను కలిగి ఉందో తెలిపింది. అంతేకాకుండా పోటాపోటీ స్థానాలను కూడా సంస్థ ఖచ్చితంగా వెల్లడించింది. సంస్థ సర్వే ప్రకారం ఏపీలో కూటమిదే విజయం అని పేర్కొంది. ఏపీలోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాలలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 98 నుంచి 104 సీట్లు సాధిస్తుందని అంచనా వేసింది. అధికార పార్టీ వైసీపీ 54 నుంచి 60 స్థానాల్లో విజయం సాధించొచ్చని పేర్కొంది. ఓట్ల శాతం విషయానికి వస్తే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 51.2 శాతం, వైసీపీ 42.8 శాతం ఓట్లు సాధిస్తాయని వివరించింది. కాంగ్రెస్ ఓట్ల శాతం 3.6గా అంచనా వేసింది. మరో వైపు ఎంపీ సీట్ల విషయంలో కూటమికి 18, వైసీపీకి 6 ఎంపీ సీట్లు వస్తాయని తెలిపింది. విజయనగరం లోక్‌సభ స్థానంలో మాత్రం పోటాపోటీ ఫలితం ఉంటుందని పేర్కొంది. వైసీపీ గెలుపొందే స్థానాలలో కడప, కర్నూలు, నంద్యాల, రాజంపేట, అరకు, తిరుపతి ఉన్నాయని తెలిపింది. అనకాపల్లి, నరసాపురం, రాజమండ్రి స్థానాలను బీజేపీ, కాకినాడ, మచిలీపట్నం ఎంపీ స్థానాలలో జనసేన జయకేతనం ఎగురవేస్తాయని పేర్కొంది. సీఎంగా చంద్రబాబు వైపు 50 శాతం మంది, జగన్ వైపు 42.5 శాతం మంది మొగ్గుచూపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: