జగన్, బాబు, పవన్ లలో పైచేయి సాధిస్తున్న నేత ఆయనే.. ఎవరూ సాటిరారుగా!

Reddy P Rajasekhar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు మరో మూడు వారాల సమయం మాత్రమే ఉంది. ఈ మూడు వారాల పాటు కష్టపడి ఓటర్ల మనస్సు గెలుచుకుంటే ఐదేళ్ల పాటు అధికారం సొంతమవుతుందని జగన్, కూటమి నేతలు భావిస్తున్నారు. అయితే ఆంధ్రా ఓటరు ఎటువైపు అనే ప్రశ్నకు మాత్రం ఆసక్తికర సమాధానం వినిపిస్తోంది. ఏపీ ఓటర్లు ఏ రాజకీయ పార్టీకి జై కొడతారనేది అంతు పట్టకుండా ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
 
అయితే బహిరంగ సభలలో అద్భుతంగా మాట్లాడే నేత ఎవరనే ప్రశ్నకు మాత్రం ఏ మాత్రం తడుముకోకుండా చంద్రబాబు నాయుడు అనే జవాబు వినిపిస్తోంది. సీనియర్ ఎన్టీఆర్, వైఎస్సార్ బహిరంగ సభలలో అద్భుతంగా మాట్లాడేవారని వారి స్థాయిలో కాకపోయినా 40 ఏళ్ల అనుభవంతో చంద్రబాబు వైసీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడంతో పాటు వైసీపీ విమర్శలకు ధీటుగా బదులిస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.
 
జగన్, పవన్ స్పీచ్ లు బాగానే ఉన్నప్పటికీ వాళ్ల స్పీచ్ లలో మరీ ప్రత్యేకత ఉండదని రొటీన్ గానే ఉంటాయనే చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ను చదివి అధికార పార్టీపై విమర్శలు చేస్తారని పొలిటికల్ వర్గాల్లో టాక్ ఉంది. చంద్రబాబు మాత్రం తన స్పీచ్ అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేలా ఉండే విధంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
 
జగన్, బాబు, పవన్ లలో తన స్పీచ్ తో ఆకట్టుకుంటున్న నేత చంద్రబాబు అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. అయితే అదే సమయంలో చంద్రబాబు ఇతర పార్టీల హామీలను కాపీ కొట్టకుండా సొంత పథకాలను ప్రకటించి ఉంటే బాగుండేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ, తెలంగాణ కాంగ్రెస్ అమలు చేస్తున్న పథకాలనే కూటమి అమలు చేస్తే కూటమి ప్రత్యేకత ఏంటనే కామెంట్లు సైతం వినిపిస్తున్నాయి. చంద్రబాబుకు అనుభవం ప్లస్ అవుతుందని ఆయనకు ఎవరూ సాటిరారని నెటిజన్లు చెబుతున్నారు. యూట్యూబ్ ఛానెళ్లు నిర్వహించే సర్వేలలో మాత్రం కూటమికే అనుకూలంగా ఫలితాలు వస్తున్నాయి.
 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: