నవనీత్ కౌర్: ఈసారి మోడీ వేవ్ కష్టమే.. తేల్చేసిన బిజెపి మహిళ నేత..!

Divya
దేశవ్యాప్తంగా ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల హడావిడి నెలకొంది.. రాజకీయ పార్టీలు తాము గెలుస్తామంటే తాము గెలుస్తామంటూ చెబుతున్నారు.. గతంలో రెండు సార్వత్రిక ఎన్నికలలో కూడా బిజెపి పార్టీ నుండి నరేంద్ర మోడీ ప్రధాని కావాలని భారతీయులందరూ కోరుకోవడం తో మోడీకి ఎదురు లేకుండా పోయింది. కానీ ఈసారి హ్యాట్రిక్ కొట్టాలనే విజయంతో మోడీ చాలా పట్టుదలతో ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే గడిచిన రెండేళ్ల నుంచి బిజెపి పార్టీ పలు రకాల వ్యూహాలను కూడా రచిస్తూనే ఉంది.అయినప్పటికీ కూడా ఇవేవీ పని చేయడం లేదా అంటే.. కొన్నిచోట్ల అవుననే సమాధానం కూడా వినిపిస్తోంది..

అయితే ఈ విషయాన్ని స్వయంగా బిజెపి మహిళా నేత నవనీత్ కౌర్ రాణా  తేల్చి చెప్పడం జరిగింది. ఈసారి ఎన్నికలలో మోడీ వేవ్ ఎక్కడ కనిపించదని తేల్చి చెప్పేసింది. బిజెపి నుంచి మహారాష్ట్రలోని అమరావతి లోక్ సభ నియోజకవర్గం నుంచి ఈమె పోటీ చేస్తున్నది. గత సార్వత్రిక ఎన్నికలలో అమరావతి సీటు నుంచే స్వతంత్ర ఎంపీగా పోటీ చేసిన నవనీత్ కౌర్ .. ఆ తర్వాత బిజెపిలోకి చేరి టికెట్ సంపాదించుకుంది. అయితే పోటీకి వచ్చేసరికి ఆమెకు పూర్తి సీన్ అర్థమైనట్టుగా తెలియజేసింది.

తాము ఈ ఎన్నికలను గ్రామపంచాయతీ ఎన్నికలగా  పోరాడాలంటూ నవనీత్ కౌర్ వెల్లడించింది.. ఓటింగ్ వేసే వారందరిని మధ్యాహ్నం 12 గంటల లోపే బూతు దగ్గరికి తీసుకువచ్చి ఓటు వేయించేలా చేయాలని మోడీ వేవ్ ఉందన్న భ్రమలో ఉండకండి అంటు పార్టీ నేతలకు కార్యకర్తలకు సైతం ఇమే సూచిస్తోంది. గతంలో ఎక్కువగా మోడీ పవనాలు వీచిన తాను స్వతంత్రంగా ఎంపిగా గెలిచిన విషయాన్ని కూడా గుర్తుచేసింది. అయితే ఈసారి గెలవడానికి చాలా కష్టపడాల్సి ఉంటుందని కూడా తెలిపింది నవనీత్ కౌర్.. అయితే ఈమె చేసిన వ్యాఖ్యల పైన ఎన్సిపి  స్పందించి నవనీత్ కౌర్ ఏం మాట్లాడినా కూడా అందులో నిజమే ఉంటుందని అది ఆమెకు తెలుసు అంటూ.. ఎన్సిపి అధికారి ప్రతినిధి మహేష్ తపసే వెల్లడించారు.. విపక్షాలను చీల్చి నేతలను సైతం తమ పార్టీలో చేర్చుకున్నప్పుడే బిజెపికి ఈ విషయం అర్థమయింది అంటూ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: