ఏపీ : ప్రశాంత్ కిషోర్ పై దీదీ షాకింగ్ వ్యాఖ్యలు..!!

murali krishna
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఎన్నికల జోరు కొనసాగుతుంది.. రేపు ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. రేపటి నుంచి రాష్ట్రంలో నామినేషన్ ల పర్వం మొదలు కానుంది.మరోపక్క దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల సందడి కూడా మొదలైంది. రానున్న ఎన్నికల్లో గెలిచి మరోసారి అధికారం చేపట్టాలని వైసీపీ భావిస్తుంది.అలాగే ప్రతి పక్ష కూటమి ఈ సారి ఎలాగైనా అధికార వైసీపీ ని గద్దె దించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంది.ఈ నేపథ్యంలో ఏపీ లో ఎన్డియే కూటమి విజయం సాధిస్తుందని ప్రముఖ ఎన్నికల వ్యూహ కర్త ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేసాడు..ఇందులో భాగంగా ఏపీ సీఎం జగన్ తన అయిదేళ్ల కాలంలో రోడ్లు వేయలేదని, రాజధాని నిర్మాణం చెపట్టలేదని అలాగే పరిశ్రమల ఏర్పాటుపై దృష్టి పెట్టలేదని కేవలం ప్రతి నెలా డబ్బులు పంచడానికే ప్రాధాన్యత ఇచ్చారని పీకే (ప్రశాంత్ కిషోర్ )వ్యాఖ్యానించారు. దీంతో అతను చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేసారు.

ఈ క్రమంలో.. ప్రశాంత్ కిషోర్ వ్యవహారంపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మరియు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ స్పందించారు. తాజాగా ఓ బెంగాలీ న్యూస్ ఛానల్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె... ఈ లోక్‌ సభ ఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్, తమ పార్టీ కోసం పని చేయట్లేదని తెలిపారు.ప్రస్తుతం ప్రశాంత్ కిశోర్ ఏపీలో బిజీగా ఉన్నారని ఆమె తెలిపారు..ఎన్డీయే కోసం ఆయన పనిచేస్తున్నారని ఆమె స్పష్టం చేశారు.. ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు బీజేపీకి అనుకూలంగా ఉన్నట్లు ఆమె తెలిపారు. దీనితో  ఎన్డీఏ భాగస్వామ్యపక్షాలు మళ్లీ విజయం సాధిస్తాయంటూ చెబుతున్నట్లు ఆమె వెల్లడించారు. ఏపీలో కూటమి కోసం ప్రశాంత్ కిషోర్ పని చేస్తూనే బయట మాత్రం అలాంటిది ఏమి లేదంటూ మాయమాటలు చెబుతున్నారని ఆమె మండి పడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: