ఎవరీ కల్పనా సోరెన్.. ఎందుకంత పాపులారిటీ..?

Divya
జార్ఖండ్ లోని రాజకీయాలు సైతం రోజురోజుకి చాలా ఉత్కంఠంగా మారుతున్నాయి.. మనీ లాండరింగ్ కేసులో  మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ అరెస్టు అయిన తర్వాత ఆయన భార్య కల్పనా సోరెన్ పేరు ఒక్కసారిగా రాజకీయాలలో బాగా వినిపించింది. ఫిబ్రవరిలో ఈమె సీఎం అవుతారని పెద్ద ఎత్తున  ఊహాగానాలు కూడా వినిపించాయి.. అయితే అనుకోకుండా కొత్త సీఎం గా చంపాయ్ సోరెన్ పదవి బాధ్యతలు చేపట్టడం జరిగిందట.కల్పనా సోరెన్ భర్త జైలులో ఉండడంతో ప్రస్తుతం లోక్సభ ఎన్నికలలో ఆమె JMM, ఇండియా కూటమి అభ్యర్థుల గెలుపు కోసం చాలా కష్టపడుతోంది..
గడచిన కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో రామ్ లీలా మైదానంలో ఇండియా కూటమి నిర్వహించినటువంటి ఒక భారీ బహిరంగ సభలో కూడా తన ప్రసంగంతో అందరిని ఆకట్టుకునేలా చేసింది కల్పనా సోరెన్.. దీంతో ఈమె గురించి తెలుసుకోవాలని చాలామంది తెగ వెతికేస్తున్నారు.. అసలు విషయంలోకి వెళ్తే.. ఒడిస్సా లోని మయూర్ భంజ్ లో 1976 లో కల్పనా సోరెన్ జన్మించింది .. ఇక ఈమె తండ్రి కూడా ఒక వ్యాపారవేత్త.. ఈమె తల్లి గృహిణి. ఈమె విద్యాభ్యాసం ఇంజనీరింగ్ పూర్తి చేయడంతో బిజినెస్ వైపుగా ఆసక్తి ఉండడంతో ఎంబీఏ కూడా పూర్తి చేసింది.

2006 ఫిబ్రవరి 7వ తేదీన హేమంత్ సోరెన్ ను వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. ప్రస్తుతం ఈమె సేంద్రియ వ్యవసాయం చేయడంతో పాటూ స్కూల్ ని నడుపుతోందట. అలాగే మహిళలు,  పిల్లలను ప్రోత్సహిస్తూ పలు రకాల కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ ఉంటుంది. ఈమె అటు వైవాహిక జీవితంలోనే కాకుండా తన భర్త హేమంత్ కు రాజకీయాలలో కూడా బాగా సపోర్టుగా ఉంటుంది.. కొన్ని ముఖ్యమైన విషయాలను సలహాలు కూడా ఇస్తూ ఉంటుందని అక్కడి నేతలు తెలియజేస్తూ ఉంటారు. అయితే ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయిన సీఎం కేజ్రీవాల్ భార్య సునీత కు ఈమె తన సంఘీభావాన్ని కూడా తెలియజేసింది.. ఈ రోజున తన పెళ్లి రోజు అని.. తన 18వ వార్షికోత్సవం జరుపుకోవడం లేదని అందుకు కారణం తన కుటుంబంలో హేమంత్ లేకపోవడమే అని అయినా కూడా తానేమి బాధపడలేదని.. ఎందుకంటే తాను ఒక వీరుడు భార్యని అంటూ త్వరలోనే తన భర్త హేమంత్ బయటికి వస్తారని ఆశిస్తున్నాను అంటూ పోస్ట్ షేర్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: