ఒంగోలు: బాలినేని వ్యతిరేకతను దామచర్ల వాడుకుంటారా..?

Pandrala Sravanthi
ప్రకాశం జిల్లాలోనే ఒంగోలు నియోజకవర్గానికి ఎంతో ప్రత్యేకత ఉంది.  ఈ నియోజకవర్గంలో గత కొన్ని ఏళ్లుగా ఆ రెండు కుటుంబాలే  ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. ఎప్పుడు నువ్వా నేనా అన్నట్టుగా తలపడుతున్న ఈ రెండు కుటుంబాల నుంచి ఈసారి కూడా ఇద్దరు అభ్యర్థులు బరిలో ఉన్నారు. వారిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పోటీ చేస్తున్నారు. టిడిపి తరఫున మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ పోటీ చేస్తున్నారు.  మరి ఈ ఇద్దరు ఉద్దండ అభ్యర్థుల మధ్య  గెలుపు ఎవరిని వరిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. 

అయితే ఒంగోలు నుంచి ఇప్పటికే నాలుగు సార్లు గెలిచిన బాలినేని  శ్రీనివాస్ రెడ్డి 2014 ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు.  గత ఎన్నికల్లో వైసిపి నుంచి మళ్లీ పోటీ చేసి గెలుపొంది నియోజకవర్గంపై పూర్తిస్థాయిలో పట్టు సాధించారు. ఈ నియోజకవర్గంలో ఒంగోలు, కొత్తపట్నం  మండలాల్లో వైసిపి భారీగా పట్టు సాధించింది. అంతేకాకుండా ఇక్కడ టిడిపికి కూడా మంచి పట్టు ఉంది. ఒంగోలులో 36వేల కమ్మ సామాజిక వర్గం వారు ఉండగా, 26వేల కాపు ఓట్లు ఉన్నాయి. ఇక్కడ గెలుపోటములు డిసైడ్ చేసేది ఈ రెండు సామాజిక వర్గాల ఓట్లే. ఒంగోలు మండలంలో టిడిపికి అనుకూలంగా ఉండే కమ్మ సామాజిక వర్గ ఓట్లను తమ వైపు తిప్పుకోవడంలో టిడిపి వెనుకబడి పోయింది. దీన్ని బాలినేని క్యాచ్ చేసుకొని  గత ఎన్నికల్లో గెలుపొందారు.  ఆ తర్వాత ఆయన కమ్మ సామాజిక వర్గం వారిని పట్టించుకోవడం మానేశారట.

అంతే కాకుండా మరికొన్ని వర్గాలను కూడా ఆయన పట్టించుకోకుండా ఉండడంతో  ఆయన రాజకీయ వ్యవహార శైలి చర్చనీయాంశంగా మారింది. దీంతో బాలినేని పై ఉన్న వ్యతిరేకత ఈసారి దామచర్లకు ప్లస్సుగా మారే అవకాశం కనిపిస్తోంది. అంతేకాకుండా ఒంగోలులో విపరీతంగా భూకబ్జాలు జరిగాయని, దాని వెనుక బాలినేని ఉన్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. బాలినేనికి మంత్రిగా అవకాశం వచ్చినా నియోజకవర్గాన్ని పెద్దగా అభివృద్ధి చేయలేదనే అపవాది కూడా ఉంది. ఇక టిడిపి తరఫున పోటీ చేస్తున్న దామచర్ల జనార్ధన్ కు సామాజికపరంగా మంచి పట్టు ఉంది. అలాగే ఈ మధ్యకాలంలో ఒంగోలులో జనసేన కూడా పుంజుకుంది. ఈ విధంగా అన్ని రకాలుగా జనార్ధన్ కు కలిసి వచ్చే అవకాశం కనిపిస్తోంది.  ఇదే తరుణంలో ఆయన వైసీపీ చేసిన తప్పులను  ప్రధాన అస్త్రాలుగా వాడుకొని ప్రచారం చేస్తే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: