ఏపీ ఎల‌క్ష‌న్స్‌: బెట్టింగ్ బోర్డుల్లో రేట్లు.. సీట్లు మారుతున్నాయ్‌... వారం రోజుల్లో తేడా ఇదే...!

RAMAKRISHNA S.S.
- నెల రోజుల్లోనే వైసీపీకి ఫేవ‌ర్‌గా మారిన సీన్‌
- యాప్‌ల‌లో వైసీపీకి 88 - 92 మ‌ధ్య‌లో ఫేవ‌ర్‌గా బెట్టింగ్‌
- 95 నుంచి ప‌డిపోతోన్న కూట‌మి గ్రాఫ్‌..?

( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )
ఏపీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో నెల రోజుల క్రింద‌టి వ‌ర‌కు ఉన్న అంచ‌నాలు ఇప్పుడు తారు మారు అవుతున్నాయి. నెల రోజుల క్రింద‌టి వ‌ర‌కు అంచ‌నాలు అన్నీ కూట‌మి వైపే ఉన్నాయి. ఈ కూట‌మిలోకి బీజేపీ వ‌చ్చి చేర‌డం... ఇటు అభ్య‌ర్థుల ఎంపిక‌లో చంద్ర‌బాబు కావ‌చ్చు... ప‌వ‌న్ కావ‌చ్చు.. బీజేపీ వాళ్లు చేసిన త‌ప్పుల‌తో వైసీపీ రోజు రోజుకు అంచ‌నాల‌కు మించి పుంజుకుంటోంది. కూట‌మి లో పెద్ద గంద‌ర‌గోళ ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో కూటమి గ్రాఫ్ రోజు రోజుకు త‌గ్గుతోంద‌నే ఎక్కువ సర్వేలు చెపుతున్నాయి.

చివ‌ర‌కు టీడీపీ అనుకూల మీడియా సంస్థ‌లు, స‌ర్వేలు కూడా రోజు రోజుకు అనూహ్యంగా కూట‌మి గ్రాప్ త‌గ్గుతోంద‌నే గ‌గ్గోలు పెడుతున్నాయి. కొద్ది రోజుల క్రింద‌ట వ‌ర‌కు అంటే సుమారుగా నెల రోజుల ముందు బెట్టింగ్ యాప్‌ల‌లో వైసీపీకి 60 నో .. అండ‌ర్ 60 అన్న బెట్టింగులు న‌డిచాయి.. వైసీపీకి 60 నెంబ‌ర్ రాదు.. 60 లోపు సీట్లు మాత్ర‌మే ఆ పార్టీ గెలుస్తుంద‌నే చెప్పాయి. ఆ టైంలో కూట‌మికి 95కు పైగా సీట్లు వ‌స్తాయ‌నే ఎక్కువ మంది బెట్టింగ్ యాప్‌ల‌లో అంచ‌నాలు వేశారు.

ఆ టైంలోనే కోట్ల కొద్ది బెట్టింగులు న‌డిచాయి. కూట‌మి గెలుస్తుంద‌ని బెట్టింగ్‌లు కాసిన వారంతా ఇప్పుడు తిప్పి రివ‌ర్స్‌ల‌లో పందాలు క‌డుతోన్న ప‌రిస్థితి ఉందంటే కూట‌మి గ్రాఫ్ ఎలా త‌గ్గిపోయిందో తెలుస్తోంది. ఇక బెట్టింగ్ యాప్‌ల‌లో ఇప్పుడు వైసీపీ ఫేవ‌రెట్ అయిపోయింది. వైసీపీ గెలుస్తుంద‌ని.. జ‌గ‌న్ ఖ‌చ్చితంగా అధికారంలోకి వ‌స్తాడ‌న్న చ‌ర్చ బాగా న‌డుస్తోంది. వైసీపీకి 88 - 92 మ‌ధ్య‌లో సీట్లు వ‌స్తాయ‌ని చూపిస్తోంది. అంటే వైసీపీ నెల రోజుల్లోనే యాప్ ల‌లో ఎలా ?  ఫేవ‌రెట్ అయ్యిందో తెలుస్తోంది. ఇందుకు కార‌ణం.. కూట‌మి త‌ప్పులే ఎక్కువుగా క‌న‌ప‌డుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: