ఏపీ:వైసీపీ నేతకు 18 నెలలు జైలు శిక్ష.. అసలేమైందంటే..?

Divya
1996 డిసెంబర్ 29న.. కోనసీమ జిల్లాలోని వెంకటపాలెంలో ఒక సంఘటన చోటుచేసుకుంది.. అదేమిటంటే ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఇద్దరు దళితులకు గుండు గీయించారు.. అలాగే ఐదు మంది దళితులను కూడా హింసించారనే విషయం అప్పట్లో రాష్ట్రంలో ఒక సంచలనంగా మారింది.. ఈ కేసులో తోట త్రిమూర్తులు కూడా 90 రోజులపాటు జైలులో కూడా ఉండి వచ్చారు. అయినప్పటికీ అప్పటినుంచి ఇప్పటివరకు ఈ కేసు కోర్టులో నడుస్తూనే ఉంది. దాదాపుగా 27 ఏళ్ల విచారణ సాగిన తర్వాత.. ఎస్సీ , ఎస్టీ కోర్టు నేరం చట్టం కింద కోర్టు తీర్పు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

దళితులను హింసించి గుండు కొట్టించడంతో  తోట త్రిమూర్తులకు కోర్టు 18 నెలలు జైలు శిక్షతో పాటు రెండు లక్షలు జరిమానా కూడా విధించింది. నిజానికి 2018 లోని తుది తీర్పు రావాల్సి ఉండగా కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలంటూ బాధితులైన కోటి చినరాజు, దడాల వెంకటరత్నం ను కోర్టు ఉత్తర్వులను జారీ చేసిందట. అయితే అప్పటి ఎమ్మెల్యేగా ఉన్న తోట త్రిమూర్తులు ఈ బాధితులు ఎస్సీలు కాదంటూ కూడా ఫిర్యాదు చేయడంతో వారికి పత్రాలను కూడా అందకుండా చేశారని ఆరోపణలు కూడా వినిపించాయి. ఆ తర్వాత కుల ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలని ఆదేశాలు జారీ చేయడంతో కోర్టు విచారణ పూర్తి అయినట్లుగా తెలుస్తోంది.

అంతేకాకుండా ప్రధాన సాక్షి అయినటువంటి కోట చినరాజు గడచిన కొద్ది రోజుల క్రితం మరణించారు.. అయితే ఆయన అనారోగ్య సమస్యతో మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు కూడా వెల్లడించారు. బాధితుడు అయినటువంటి కోట చినరాజు ఆయన సోదరులు ఐదుగురిలో ఇద్దరు మరణించడంతో పాటుగా 15 మంది సాక్షులలో ఇద్దరు మరణించారట. దాదాపుగా ఈ కేసు 148 సార్లు వాయిదా పడినట్లుగా సమాచారం. అయితే ఎట్టకేలకు ఈ కేసు నమోదైన 28 సంవత్సరాల తర్వాత వారికి న్యాయం లభించింది. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు 18 నెలల జైలు శిక్ష పడింది.. ప్రస్తుతం తోట త్రిమూర్తులు వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: