మచిలీపట్నం: బాలశౌరి Vs చంద్రశేఖర్.. ప్రజలేవైపు ఉన్నారంటే.?

Pandrala Sravanthi
• డాక్టర్ సేవలు గెలిపిస్తాయా..?
 • కొనకళ్ల సపోర్ట్ కూటమికి ఉంటుందా..?
• అభివృద్ధి పనులు బాలశౌరికి కలిసి వస్తాయా.?

ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది నాయకులు వారి ప్రచారంలో జోరును పెంచుతున్నారు. ఓటర్లను  ప్రసన్నం చేసుకునేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. కనీసం రోజుకు ఐదు గంటలు కూడా నిద్రపోకుండా  నిర్విరామంగా శ్రమిస్తున్నారని చెప్పవచ్చు. అలాంటి ఆంధ్ర ప్రదేశ్  రాజకీయాల్లో అత్యంత ఆదరణ పొందినటువంటి లోక్ సభ స్థానం మచిలీపట్నం. ప్రస్తుతం రాష్ట్రంలోని అందరి చూపు  ఈ స్థానం పైనే పడింది. ఇక్కడి నుంచి బాలశౌరి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వైసిపి నుంచి  డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ బరిలో ఉన్నారు. ఎంతో ఆదరణ కలిగినటువంటి ఈ ఇద్దరు నాయకుల్లో  ప్రజా ఆదరణ ఎవరికి ఉంది.. వారి బ్యాగ్రౌండ్ ఏంటి అనేది చూద్దాం..
మచిలీపట్నం లోక్ సభ నియోజకవర్గంలో మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఇందులో గుడివాడ, గన్నవరం, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు, పెనమలూరు ఉన్నాయి. టిడిపి ఆవిర్భావం తర్వాత మచిలీపట్నం పార్లమెంటు స్థానానికి పదిసార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో ఐదు సార్లు టిడిపి గెలిస్తే మరో  ఐదు సార్లు మిగతా పార్టీలు గెలిచాయి. 2019లో మాత్రం బాలశౌరి  వైసిపి నుంచి భారీ మెజారిటీతో గెలుపొందారు.  అయితే ఈసారి కూడా తనకే టికెట్ వస్తుందని భావించిన బాలశౌరికి  వైసిపి మొండి చేయి చూపించింది. దీంతో ఆయన జనసేన పార్టీలో చేరి  టికెట్ తెచ్చుకున్నారు.  ఇదే తరుణంలో ఆంద్రా రాజకీయంలో ఒకప్పుడు పేరుగాంచినటువంటి సింహాద్రి చంద్రశేఖర్  తండ్రి వారసత్వాన్ని పుచ్చుకొని మొదటిసారి ఆయన కొడుకు ఎన్నికల బరిలో ఉంటున్నారు. ఇద్దరు బలమైన అభ్యర్థుల యొక్క బలబలాలు ఏంటో చూద్దాం..
 సింహాద్రి చంద్రశేఖర్ :
 సింహాద్రి చంద్రశేఖర్ క్యాన్సర్ డాక్టర్ స్పెషలిస్ట్ గా ఎంతో గుర్తింపు పొందారు. అయితే చంద్రశేఖర్ తండ్రి సింహాద్రి సత్యనారాయణ రావు 1985 నుంచి 1999 వరకు  వరుసగా మూడుసార్లు అవనిగడ్డ నియోజకవర్గం నుంచి గెలుపొంది  దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రులుగా కూడా పనిచేశారు. ఇదే తరుణంలో మచిలీపట్నం పార్లమెంటు స్థానంలో ఎన్నో మంచి పనులు చేశారు. ఆయన సేవలను గుర్తించినటువంటి వైసిపి  తన కుమారుడైన చంద్రశేఖర్ కు ఈ టికెట్ ఖరారు చేసింది. దీంతో చంద్రశేఖర్ మొదటిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి తన సత్తా చూపించాలని  అనుకుంటున్నారు. డాక్టర్ గా ఎంతో మంది పేదలకు సేవ చేశానని, నాయకుడిగా గెలిచి మరిన్ని సేవలు అందిస్తానని ఆయన ప్రచారంలో  చెబుతున్నారు. అంతేకాకుండా సింహాద్రి సత్యనారాయణ ఫ్యామిలీకి  మచిలీపట్నం వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉండడమే కాకుండా ఎలాంటి  చెడ్డ పేరు కూడా లేదు.  దీంతో ఆయన మంచితనం ఈ పార్లమెంటు పరిధిలో కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు.
 వల్లభనేని బాలశౌరి:
 ప్రస్తుతం మచిలీపట్నం సిట్టింగ్ ఎంపీగా వల్లభనేని బాలశౌరి ఉన్నారు.  ఈసారి కూడా తనికే టికెట్ వస్తుందని ఆశించారు.  కానీ వైసీపీ గేరు మార్చి ఆయనకు టికెట్ లేదని చెప్పడంతో జనసేన పార్టీలో చేరిపోయారు. దీంతో ఆ పార్లమెంటు నియోజకవర్గంలో జనసేన టికెట్ ఆయనకు ఖరారు చేసింది. అయితే బాలశౌరికీ ఈ ప్రాంతంలో మంచి పేరు ఉంది. ఆయన ఎంపీగా చేసినన్ని రోజులలో  గుడివాడ రైల్వే ఓవర్ బ్రిడ్జి, అలాగే బందర్ పోర్టు పనులను తీసుకువచ్చారు. అంతేకాకుండా రేపల్లె, బందర్ రైల్వే లైన్  అలాగే విజయవాడ నుండి పినాకిని, రత్నాచల్ నుండి సూపర్ ఫాస్ట్ రైళ్లతో  పాటుగా మచిలీపట్నం లింకు రైలు కూడా  నా హయాంలోనే రాబోతున్నాయని,  మరోసారి గెలిపించిన వెంటనే ఇవి ఈ ప్రాంతానికి వస్తాయని ఆయన ప్రజల్లో బలంగా చెబుతూ ప్రచారం చేస్తున్నారు.
 గెలిచేది ఎవరు:
 ఓవైపు బాలశౌరి  మరోవైపు చంద్రశేఖర్  ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇదే తరుణంలో ఇదే పార్లమెంటు నియోజకవర్గం నుంచి  రెండుసార్లు టిడిపి ఎంపీగా గెలిచినటువంటి కొనకళ్ల నారాయణ  ఈసారి టికెట్ వస్తుందని ఆశించారు. కానీ బాలశౌరికి టికెట్ కేటాయించడంతో ఆయన కాస్త నైరాశ్యంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ నారాయణ బాలశౌరికి సపోర్ట్ అందించకుంటే మాత్రం  టిడిపి గెలుపు నల్లేరు మీద నడకే అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: