జగన్ పై దాడి ఘటనలో దొరకని ఆధారాలు.. ఆ ఒక్కడు దొరకడం సులువు కాదా?

Reddy P Rajasekhar
ఏపీ సీఎం వైఎస్ జగన్ పై జరిగిన దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం అయిన సంగతి తెలిసిందే. జగన్ పై దాడి ఘటనలో సరైన ఆధారాలు ఇంకా దొరకలేదు. రాయితో దాడి చేశాడని పోలీసులు చెబుతున్నా రాయిని గుర్తించలేకపోయామని పోలీసుల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సరైన ఆధారాలు లేకుండా నిందితుడిని పట్టుకోవడం సులువు కాదనే సంగతి తెలిసిందే.
 
సీపీ కాంతిరాణా మీడియాతో మాట్లాడుతూ జగన్ పై దాడి జరిగిన ప్రాంతంలో 5,000 మంది ప్రజలు ఉన్నారని అక్కడ అంతా చీకటిగా ఉందని అంతమందిలో ఒక్కడిని పట్టుకోవడం కష్టమని వెల్లడించారు. స్థలంలో కొన్ని రాళ్లు దొరికినా ఏ రాయితో దాడి చేశారన్నది నిందితుడు దొరికితే మాత్రమే తెలుస్తుందని ఆయన అన్నారు. ఐపీసీ 307 సెక్షన్ కింద కేసు నమోదు చేశామని సీపీ కాంతిరాణా వెల్లడించారు.
 
ఈ కేసులో కుట్రదారులను కఠినంగా శిక్షించాలని వైసీపీ అభిమానులు భావిస్తున్నారు. ఈ కేసులో చిన్న ఆధారం దొరికినా నిందితుడిని పట్టుకోవడం తేలిక అవుతుందని చెప్పవచ్చు. పోలీసులు 2 లక్షల రూపాయల నజరానా ప్రకటించిన నేపథ్యంలో నిందితుడి గురించి సమాచారం తెలిసిన వ్యక్తులు ఎవరైనా సమాచారం అందిస్తారేమో చూడాల్సి ఉంది. నిందితుడు దొరికితే వైసీపీకే బెనిఫిట్ కలుగుతుందనే ప్రచారం కూడా జరుగుతోంది.
 
టీడీపీ, జనసేన నేతలు ఈ దాడి విషయంలో పాజిటివ్ గా స్పందించినా, నెగిటివ్ గా స్పందించినా వాళ్లకు నెటిజన్ల నుంచి ధీటుగా కౌంటర్లు వస్తున్నాయి. కోడికత్తి డ్రామా 2.0 అంటూ టీడీపీ, జనసేన పార్టీలకు ఇలాంటి కామెంట్ల వల్ల నష్టం కలుగుతుందని ఆ పార్టీ కార్యకర్తలు ఫీలవుతుండటం గమనార్హం. అర్బన్ ఓటర్ల మద్దతు కూటమికి ఉండగా రూరల్ ఓటర్లు మాత్రం వైసీపీకి అనుకూలంగా ఉన్నారు. ఏపీ  రాజకీయ పార్టీలు ప్రకటించే తుది మేనిఫెస్టో ఎన్నికల ఫలితాలను కొంతమేర చేసే ఛాన్స్ ఉందని చెప్పవచ్చు.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: