ఆయన కాంగ్రెస్ లో చేరడం.. రేవంత్ కి అసలు ఇష్టం లేదా?

praveen
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే ఆ పార్టీలోని కీలక నేతలు అందరిని కూడా హస్తం గూటికి చేర్చుకుంది. ఇంకా ఈ ఆపరేషన్ ఆకర్ష్ మాత్రం ఆపలేదు. ఇక ఇటీవలే మరో కొత్త నాయకుడు అటు కారు పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీ చెంతకు చేరాడు. ప్రముఖ గాయకుడు బహుజన యుద్ధనౌకగా పేరుపొందిన ఏవూరి సోమన్న హస్తం పార్టీలో చేరారు. ఇక ఆయన చేరిక కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి తో సన్నిహిత సంబంధాలు ఉన్న ఏవూరి సోమన్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరడం చర్చనీయాంశంగా మారిపోయింది.

 అయితే గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైయస్సార్ తెలంగాణ పార్టీలో ఉన్న ఆయన ఆ తర్వాత బిఆర్ఎస్ లో చేరారు. అయితే కారు పార్టీలోకి వెళ్లడానికి ముందే కాంగ్రెస్ నుంచి ఆయనకు ఆహ్వానం అందింది. కానీ తుంగతుర్తి టికెట్ పై హామీ ఇస్తేనే కాంగ్రెస్లో చేరుతానని ఒక కండిషన్ పెట్టారు సోమన్న. కానీ అద్దంకి దయాకర్ లేదా డాక్టర్ రవి అప్పటికే టికెట్ కోసం పోటీలో ఉన్నారు. దీంతో ఇక సోమన్న కండిషన్ కాంగ్రెస్ కాదనడంతో బీఆర్ఎస్ లోకి వెళ్లారు. అయితే సాంస్కృతిక సారధి బాధ్యతలు అప్పగిస్తామని రేవంత్ హామీ ఇచ్చిన ఆయన కాంగ్రెస్ పార్టీని వద్దనుకున్నారు.

 ఇక అసెంబ్లీ ఎన్నికల సమయంలో కారు పార్టీ తరపున ఆడి పాడారు. కానీ ఆ తర్వాత బిఆర్ఎస్ ఓటమిపాలు కావడంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు సోమన్న. ఇక ఇప్పుడు చివరికి కాంగ్రెస్ పార్టీలో చేరారు. నిజానికి సీఎం రేవంత్ రెడ్డితో సోమన్నకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కానీ రేవంత్ సమక్షంలో కాకుండా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరడం చేర్చనీయాంశంగా మారింది. దీంతో గతంలో తన మాట కాదని కారు పార్టీలోకి వెళ్ళిన సోమన్న మళ్ళీ కాంగ్రెస్లోకి రావడం రేవంత్ ఇష్టం లేదని వాదనలు కూడా తెరమీదకి వస్తున్నాయి. అయితే రేవంత్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోనే కోమటిరెడ్డి సమక్షంలో చేరారా.. లేకపోతే రేవంత్ కు తెలియకుండా కోమటిరెడ్డి  సోమన్నకు కాంగ్రెస్ కండువా కప్పారా అన్నది చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ ని కాదని సోమన్న కాంగ్రెస్ లో చేరే ఛాన్స్ అయితే లేదు. నల్గొండ జిల్లాలో చేరికలు కోమటిరెడ్డి కనసన్న లో జరగాలనే ఒప్పందంలోనే ఇలా సోమన్న రేవంత్ సమక్షంలో కాకుండా రాజగోపాల్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: