రాయి ఎటాక్ (పచ్చ మీడియా): బాబు పై అలా.. జగన్ పై ఇలా ..!

Divya

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నిన్నటి రోజున విజయవాడ ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు రాయి విసిరి గాయపరిచారు.. అయితే ఈ విషయం పైన కొంతమంది నేతలు తనకి తాను చేసుకున్న దాడి అంటూ చాలా హేళన చేస్తున్నారు. అంతేకాదు తెలుగుదేశం మీడియా అనుకూలస్తులు కూడా ఇటువంటి ప్రచారమే చేస్తూ ఉన్నారు.. కేవలం ఇదంతా సానుభూతి కోసమే అంటూ గత ఎన్నికలలో కోడి కత్తితో పాపులర్ అయిన జగన్ ఇప్పుడు అదే తరహాలో మళ్లీ ఎదురు దాడి చేయించుకున్నారంటూ ప్రచారం చేస్తున్నారు.

సీఎం జగన్ పై విసిరిన రాయి నుదుటికి తాకింది కాబట్టి సరిపోయింది లేకపోతే సమస్య వేరే రకంగా ఉండేదని వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో కూడా కోడి కత్తి దాడి అంటూ ఎల్లో మీడియా తక్కువ చేసి  చూపించే ప్రయత్నం చేసింది. ఇప్పుడు కూడా అదే ధోరణిలో తనదైన ఎదురుదాడి వ్యూహంతో పిచ్చిపిచ్చి రాతలు రాస్తున్నారు. సీఎం జగన్ పైన ఇంత అవమానకరంగా వ్యవహరిస్తోంది తెలుగుదేశం అనుకూల మీడియా..కానీ చంద్రబాబు నాయుడు విషయంలో మాత్రం వింతగా ప్రచారం చేయడం చూసి  అందరూ ఆశ్చర్యపోతున్నారు.

స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు రాజమండ్రి జైలులో ఉన్న సమయంలో పచ్చ మీడియా నానా హంగామా చేసింది.. చంద్రబాబును దోమలు  కుడుతున్న గదిలో వేశారని.. దోమలతో కుట్టించి చంపడానికి ప్రభుత్వం కుట్ర చేస్తోంది అంటూ పలు రకాల కథనాలు కూడా రాశారు. అంతేకాకుండా వీటిపైన మరీ చర్చ పెట్టి దోమల వల్ల చంద్రబాబుకు డెంగ్యూ వ్యాధి వస్తుందనీ ఆ విధంగా చంద్రబాబుని చంపడానికి కుట్ర చేశారంటూ జనాన్ని కూడా నమ్మించే ప్రయత్నం చేశారు.. జైలుకు దగ్గరలో ఎక్కడో డ్రోన్ కెమెరా తిరుగుతూ ఉంటే పలు రకాల  కథనాలను కూడా అల్లారు. చంద్రబాబుకు ప్రాణహాని ఉందని.. స్వయంగా నారా లోకేసే ఆరోపించారు.. ఇలా చంద్రబాబు మీడియా చంద్రబాబు విషయంలో మరొకలా  జగన్ విషయంలో మరొక లాగా స్పందిస్తోంది. పచ్చ మీడియా నందిని పందిని ..పందిని నందిని చేయగలమని నిరూపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: