అభిమానిని కొట్టిన బాలయ్య.. ఇదేనా టీడీపీ ప్రచారమంటే?

Purushottham Vinay
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సీజన్ లో ప్రచారాలు హోరెత్తిపోతున్న సంగతి తెలిసిందే. అధికార, విపక్షాలు ఎవరి స్టైల్లో వారు ప్రచార కార్యక్రమాలు స్టార్ట్ చేశారు.ఈ సందర్భంగా ఆరోపణలు, విమర్శలు ఇంకా సవాళ్లతో హోరెత్తించేస్తున్నారు రాజకీయ నేతలు. ఇందులో భాగంగా తాజాగా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలయ్య కూడా ప్రచారానికి సిద్ధమయ్యారు. ఇక ఈ సందర్భంగా అనూహ్యపరిణామం చోటుచేసుకుంది. ఇందులో భాగంగా... అభిమానిపై బాలయ్య చెయ్యిచేసుకోవడం జరిగింది. ఏపీలో పోలింగ్ తేదీ సమీపిస్తోన్న వేళ ఆంధ్రప్రదేశ్‌ లో ఎన్నికల ప్రచారం సెగ పెంచుతుంది. ఈ సందర్భంగా పార్టీల అధినేతలు రాష్ట్రవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలకు తెరలేపుతున్న నేపథ్యంలో... అభ్యర్థులు వారి వారి నియోజకవర్గాల్లో ప్రచార కార్యక్రమాలని మొదలు పెట్టేసారు. ఈ సమయంలో... సీమసింహ, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా ప్రచారానికి రెడీ అయ్యారు.ఈ సందర్భంగా... కదిరిలో ప్రచారాన్ని ప్రారంభించిన ఆయన... ఉమ్మడి అనంతపురం జిల్లాలో రెండు రోజుల పాటు ప్రచారాన్ని జరపనున్నారు.


అయితే... ఎన్నికల ప్రచారానికంటే ముందే తన స్టైల్ లో ఫ్యాన్స్ పై దూకుడు షురూ చేసేశారు బాలయ్య. ఇందులో భాగంగా... శ్రీ సత్యసాయి జిల్లాలో అభిమానిపై కోపం వ్యక్తం చేసి, చేయి కూడా చేసుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారుతోంది.ఇందులో భాగంగా... బాలకృష్ణ వచ్చిన హెలికాప్టర్‌ ల్యాండ్‌ అవ్వగానే.. హెలీప్యాడ్ దగ్గరకు ఒక్కసారిగా దూసుకొచ్చారు బాలయ్య అభిమానులు. ఈ సందర్భంగా... జై బాలయ్య.. జైజై బాలయ్య అంటూ నినాదాలు చేస్తూ ఆయనకు స్వాగతం పలికారు. ఈ సమయంలో ఒక అభిమాని మాత్రం బాలయ్యతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆ అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాలకృష్ణ వెంటనే చేయి చేసుకున్నారు.దీంతో... బాలయ్య ఈ ప్రచార కార్యక్రమాల్లో ఇంకెంతమందిపై దబిడి దిబిడి అంటారో అనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. ఎన్నికల వేళ ఇలాంటి దూకుడు తగ్గించుకుంటే మంచిదంటున్నారు నెటిజన్స్. కిందరు నెటిజన్స్ ఓట్లు కోసం ప్రచారం చేసుకునే మీరు జనాలు అభిమానం చూపిస్తే ఇలా కొడతారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: