ఏపీ : పవన్ కు ఓటేయొద్దని బెదిరింపులు.. అక్కడ జరిగిందే ఇక్కడా జరుగుతోందా?

Reddy P Rajasekhar
2019 ఎన్నికల్లో జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండు అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేయగా రెండు స్థానాలలో జనసేనను ఓడించడంలో వైసీపీ సఫలమైంది. 2019 ఎన్నికల సమయంలో జగన్ కు అనుకూలంగా పరిస్థితులు ఉండటంతో గాజువాక, భీమవరం నియోజకవర్గాల్లో వైసీపీకి అనుకూలంగా ఫలితాలు వచ్చాయి. అయితే ఈ ఎన్నికల్లో సైతం పవన్ ను ఓడించడానికి పరోక్షంగా అధికార పార్టీ తమ వంతు ప్రయత్నాలు చేస్తోందని ప్రచారం జరుగుతోంది.
 
పిఠాపురంలో పవన్ తరపున ప్రచారం చేస్తున్న ఎస్వీఎస్ఎన్ వర్మ పవన్ కు ఓటేయకుండా కుట్రలు జరుగుతున్నాయని వెల్లడించారు. ఒక బ్యాంక్ నుంచి రుణాలు తీసుకున్న రైతులపై వైసీపీకి ఓటేయాలని ఒత్తిడి పెరుగుతోందని వైసీపీకి ఓటేస్తారా? లేక తీసుకున్న రుణాలను వడ్డీతో సహా చెల్లిస్తారా? అని బెదిరింపులకు పాల్పడుతున్నారని వర్మ అన్నారు. వర్మ చేసిన కామెంట్లు ఏపీలో హాట్ టాపిక్ అవుతున్నాయి.
 
టీడీపీ, జనసేన పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్న వాళ్లను మాత్రమే ఈ విధంగా టార్గెట్ చేశారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. బ్యాంక్ అధికారుల తీరు గురించి ఈసీకి ఫిర్యాదు చేస్తామని వర్మ చెబుతున్నారు. గతంలో ఒక సందర్భంలో తిరుపతిలో ఒక పార్టీ అభ్యర్థులు తమ పార్టీకి ఓటేయకపోయినా పరవాలేదని అవతలి పార్టీ అభ్యర్థికి మాత్రం ఓటేయొద్దని డబ్బులు పంచారు.
 
పిఠాపురంలో సైతం పవన్ ను ఓడించడానికి అదే తరహా ప్లాన్స్ జరుగుతున్నారని పవన్ అభిమానులు భావిస్తున్నారు. పవన్ ను ఓడించాలని వైసీపీ తప్పటడుగులు వేస్తే న్యూట్రల్ ఓటర్లు సైతం పవన్ కు ఓటు వేసే ప్రమాదం ఉందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ పవన్ ను ఓడించాలని కుట్రలు చేయకుండా వంగా గీత గెలుపు కోసం ప్రయత్నిస్తే మంచిదని చెప్పవచ్చు. పిఠాపురంలో గెలుపు విషయంలో పూర్తిస్థాయిలో నమ్మకం ఉండటంతో పవన్ సైతం ఇతర నియోజకవర్గాలపై ఫుల్ ఫోకస్ పెట్టారని భోగట్టా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: