రాయలసీమ (రాజంపేట): టిడిపిలో అభ్యర్థుల వార్.. సీట్ ఎవరికి..!

Divya
ఆంధ్రప్రదేశ్లోని రాజకీయాలు రోజురోజుకి ఎంత హీటెక్కిస్తున్నాయో చెప్పాల్సిన పనిలేదు.. ముఖ్యంగా రాజంపేట టిడిపిలో అసంతృప్తులు గత కొద్దిరోజులుగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా రాజంపేట నియోజకవర్గం లో టిడిపికి ఒక వింత పరిస్థితి ఎదురవుతోంది. ఎన్నికల ప్రచారాన్ని సైతం నిర్వహిస్తున్నారు టిడిపి అభ్యర్థి బాలసుబ్రమణ్యం.. చంద్రబాబు ప్రకటించిన అభ్యర్థి నేనే అంటూ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. మరొకవైపు ఇంటింట ప్రచారం చేపట్టారు టిడిపి నేత చంగల్ రాయుడు. రాజంపేట అభ్యర్థి పైన చంద్రబాబు నాయుడు పురాలోచన చేస్తారనే ధీమాతో ఉన్నట్లు తెలుస్తోంది.

దీంతో రాజంపేటలో ఇద్దరు నేతలు ప్రచారం చేస్తూ ఉండడంతో టిడిపి కార్యకర్తలలో ఒక్కసారిగా అయోమయం నెలకొంది. ఒక్కసారిగా ఇద్దరి నేతల కార్యకర్తలు, నాయకులు సైతం తమ తమ బలాలను ప్రదర్శించడానికి సైతం పలు రకాల ఏర్పాట్లను కూడా చేస్తున్నారు. చంగల్ రాయుడు తీరుతో ఒక్కసారిగా అధిష్టానానికి తలనొప్పిగా మారుతోంది. ఈ నేతకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నా ఫలితం కనిపించడం లేదు. ఇలా ఇద్దరు నేతలు రాజంపేటలో పోటాపోటీలో ప్రచారంలో పాల్గొనడంతో తెలుగు తమ్ముళ్లు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారట.

సీఎం జగన్ సొంత జిల్లాలో పాగా వేయాలనుకున్న  టిడిపి ప్రయత్నాన్ని.. ఆ పార్టీ నేతలే దెబ్బి పొడుస్తున్నారనే విధంగా వాదనలు వినిపిస్తున్నాయి. 2019 ఎన్నికలలో  కడప జిల్లాలలో వైసిపి క్లీన్ స్వీప్ చేసింది. ఈసారి ఎన్నికలలో ఎలాగైనా సరే ఉనికిని చాటుకోవాలనే నేపథ్యం లో కొత్త అభ్యర్థులను రంగంలోకి తీసుకువచ్చారు చంద్రబాబు.. ఇదే టిడిపి నేతల మధ్య విభేదాలకు దారితీసింది. దీంతో రాజంపేటలో కొత్త , పాత నాయకుల మధ్య అగ్గి రాజేస్తోంది.. ఐదేళ్లుగా రాజంపేట టిడిపి ఇన్చార్జిగా ఉన్న చంగల్ రాయుడును కాదని అధిష్టానం బాలసుబ్రమణ్యానికి టికెట్ కేటాయించింది టిడిపి.. స్థానికేతరుడుకి టికెట్ ఎలా ఇస్తారంటూ చంగల్ రాయుడు అసంతృప్తిని తెలియజేస్తున్నారు. అభ్యర్థిని మార్చాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న అధిష్టానం మాత్రం దీనికి అంగీకరించడం లేదని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: