ఏపీ: కర్నూలు జిల్లాలో టీడీపీ నేతల్లో తీవ్ర అసంతృప్తి.. తుడిచిపెట్టుకుపోతుందా..?

Suma Kallamadi

దశాబ్దాలుగా కర్నూలు జిల్లాలో టీడీపీ పార్టీ చాలా బలహీనంగా తయారవుతోంది. సరైన నాయకత్వం లేకపోవడం కారణంగా అక్కడ టీడీపీ నేతలలో అసంతృప్తి తీవ్ర స్థాయిలో పెరిగిపోతోంది. ముఖ్యంగా టికెట్ల కేటాయింపు విషయంలో సమన్వయ లోపం వల్ల టీడీపీ బాగా నష్టపోతుందని తెలుస్తోంది. ఈసారి చేసిన తప్పుల వల్ల కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి తీరని నష్టం జరుగుతుందని, దారుణమైన పరాజయాలు చవిచూసే అవకాశం ఉందని స్పష్టమవుతోంది. చాలామంది నేతలు పార్టీని వీడాలని భావిస్తుంటే, మరికొంతమంది సొంత పార్టీ అభ్యర్థులే ఓడిపోవాలని కోరుకుంటున్నారు.
సమన్వయ నేతల బృందం టికెట్ల కేటాయింపు విషయంలో చేసిన తప్పుల కారణంగా టీడీపీలోని ముఖ్య నేతలు పార్టీ మారడానికి కారణమవుతోందని చర్చలు సాగుతున్నాయి. కర్నూలు జిల్లాలో టీడీపీ కొన్ని నియోజకవర్గాలలో పరిస్థితులను చక్కబెట్టుకోగలిగింది. కానీ మిగతా వాటిలో పరిస్థితి మరింత ప్రతికూలంగా మారింది. మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ మసాలా పద్మజ, ఆలూరు మంత్రాలయం ఇన్చార్జిలు వైకుంఠం మల్లికార్జున, తిక్కారెడ్డి వాటిని వీడాలని  యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
కేఈ ప్రభాకర్, వైకుంఠం మల్లికార్జున ఆల్రెడీ వైసిపి నేతలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. వీరిద్దరూ కూడా టిడిపి పార్టీ నుంచి టికెట్ ఆశించారు కానీ మొండి చెయ్యే ఎదురయింది. అందువల్ల బాగా డిసప్పాయింట్ అయ్యారు. టికెట్ ఇవ్వకపోయినా పర్లేదు, సరిపెట్టుకుందాం అనుకున్నారు కానీ కనీస ప్రాధాన్యత కూడా పార్టీలో దొరకడం లేదట. అందుకే వైసీపీలోకి జంప్ చేయాలని బాగా కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.
టీడీపీ అభ్యర్థి వీరభద్ర గౌడ్ కి వ్యతిరేకంగా ప్రచారం చేయాలని మాసాల పద్మజ నిర్ణయించుకున్నారట. వీరభద్ర గౌడ్ కనీసం మద్దతు అడగలేదని అసలు తమను పట్టించుకోలేదని పద్మజ వాపోతున్నారు అందుకే ఆమె వైసీపీలో చేరాలని ఆలోచిస్తున్నారని సమాచారం. బాగా ఆశ చూపించి పెట్రోల్ బంక్ కూడా అమ్మేలా చేసి టికెట్ ఇవ్వకపోవడం దారుణమని అన్యాయమని ఆమె అసహనం వ్యక్తం చేస్తున్నట్లు సన్నిహిత వర్గాల సమాచారం. మరోవైపు వైసీపీ ఇలాంటి అసంతృప్తి నేతలను తమలో కలుపుకొని ఓట్లను ఎక్కువ సంపాదించాలని కృషి చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: