ఏపీ: ఎస్సీ ఓటర్లను గెలుచుకునేందుకు పెద్ద స్కెచ్ వేసిన చంద్రబాబు..??

Suma Kallamadi

ఒకప్పుడు ఎస్సీ సామాజిక వర్గంలో కాంగ్రెస్‌కి భారీ ఓట్ బ్యాంకు ఉండేది. ఎస్సీ వర్గానికి చెందిన ప్రజలు కాంగ్రెస్ పార్టీకి రెండో ఆలోచన లేకుండా ఓట్లు గుద్దేవారు. అయితే అప్పట్లో చంద్రబాబు నాయుడు మాదిగలకు వర్గీకరణ అనే ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. తద్వారా ఎస్సీలలో మాదిగల ఓట్లను తన పార్టీ వైపు ఆకర్షించుకోగలిగారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత ఆ ఓట్లను చంద్రబాబు కోల్పోయారు. ఎందుకంటే మాదిగ సామాజిక వర్గం ప్రజలు ఎక్కువగా తెలంగాణలోనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మాల సామాజిక వర్గం ప్రజలే ఎక్కువ.
ఎస్సీ ప్రజల ఓట్లను పొందడానికి జూపూడి ప్రభాకర్ లాంటి నేతలను తీసుకున్నారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నుంచి కాంగ్రెస్ పార్టీకి మాలలు ఎక్కువగా సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఈ విషయాన్ని గ్రహించిన చంద్రబాబు మందకృష్ణ మాదిగను మంచి చేసుకున్నారు. అందుకే ఆయన టీడీపీకి ఓట్లు వేయాలని తన సామాజిక వర్గాన్ని అడుగుతున్నారు.
 అలానే మాల సామాజిక వర్గ ప్రజల ఓట్లను గెలుచుకునేందుకు మహాసేన రాజేష్, జడ శ్రావణ్ కుమార్ ద్వారా చంద్రబాబు పెద్ద స్కెచ్ వేశారు. వారితోటి సమావేశాలు మీటింగ్స్ నిర్వహిస్తూ టీడీపీకి ఓటు వేసేలా ప్రోత్సహిస్తున్నారు. అదే సమయంలో వైసీపీ మాల ఓట్లను చీల్చేసి అవన్నీ తమ పార్టీకి పడేలా ప్రయత్నాలు చేస్తున్నారు.
 ఏదేమైనా చంద్రబాబు తన 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని వాడుకుంటూ ఎంతో కొంత స్థాయిలో ఓట్లను సంపాదించేందుకు కృషి చేస్తున్నారు. ఈ ఒక్క సామాజిక వర్గ ఓటర్లను ఆకర్షిస్తే సరిపోదు. ప్రజలందరూ ఓటు వేస్తేనే గెలిచే అవకాశం ఉంటుంది. అలా ఓటర్ల అందరి మనసును గెలుచుకోవాలంటే ప్రజల్లో నమ్మకం గెలుచుకోవాలి. జగన్ ఆ విషయంలో సక్సెస్ అయినట్లు కనిపిస్తోంది. అందుకే ఆయన బస్సు యాత్రకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. మండుటెండలను సైతం లెక్క చేయకుండా ఏపీ ప్రజలు ఆయనకు సపోర్ట్ చేసేందుకు ముందుకొస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: