ఏపీ: బుట్టా రేణుక గెలిచే ఛాన్సులు దాదాపు శూన్యం..?

Suma Kallamadi
* బుట్టా రేణుక చౌదరి ఈసారి గెలుస్తారా  
* ప్రజల్లో ఆమె పట్ల ఆదరణ తగ్గుతోందా
* అదొక్క విషయమే ఆమెకు పెద్ద మైనస్‌
(రాయలసీమ- ఇండియా హెరాల్డ్)
 
వైసీపీ రాజకీయ నాయకురాలు బుట్టా రేణుక ఇటీవల కొన్ని రుణాల విషయంలో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఎల్ఐసీ సంస్థ ఆమె ఆస్తులను వేలం వేయడానికి రెడీ అయింది. ఈ విషయాల్లో ఆమె కాస్త ఇబ్బందులను ఎదుర్కొంటోంది. వాస్తవానికి ఆమెకు వైసీపీ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని అందించింది. ఎమ్మిగనూరు అసెంబ్లీ స్థానానికి వైసీపీ తరఫున పోటీ చేస్తున్న బుట్టా రేణుక ఈ ఆర్థిక చిక్కుల్లో పడటం కాస్త కలవరపెట్టే విషయమే.
రేణుక 2019లో పోటీ చేయలేదు. 2014 కర్నూలు నుంచి వైసీపీ ఎంపీగా కాంటెస్ట్ చేసి మంచి విజయం సాధించారు. ఎంపీ నామినేషన్ సమయంలో ఆమె అఫిడవిట్ ప్రకారం ఆమె ఆస్తులు అక్షరాలా రూ.242.60 కోట్లు కాగా కరోనాకు ముందు సమయంలో వ్యాపారాలు స్థాపించడానికి వందల కోట్లు అప్పుగా తీసుకున్నారు. వాటిని చెల్లించడంలో విఫలమై చివరికి ఆస్తులు వేలం వేసే పరిస్థితి ఏర్పడింది. ఆమెకు పోటీగా టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జయ నాగేశ్వరరెడ్డి నిలబడ్డారు. మరి ఈసారి ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఎవరి గెలుస్తారు అనేది ప్రస్తుతానికి అయితే సస్పెన్స్ గానే ఉంది.
ఓవరాల్ అవుట్ లుక్ చూసుకుంటే వైసీపీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వైసీపీ పార్టీ మంచి సంక్షేమ పథకాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోగలిగింది. కాబట్టి ఎమ్మిగనూరు వాసులు జగన్ ఎమ్మెల్యే అయిన బుట్ట రేణుకను గెలిపించవచ్చు. ఆమెకు ఆ నియోజకవర్గంలో మంచి ప్రజాదరణ ఉందని తెలుస్తోంది. కానీ ఆమె జయ నాగేశ్వరరావు రెడ్డి వలె లోకల్ లీడర్ కాకపోవచ్చు. ఇది ఆమెకు ఒక మైనస్ కావచ్చు.
మరోవైపు ప్రజల నేత జగన్ బస్సు యాత్రకు విశేషమైన స్పందన లభిస్తుంది. ఎమ్మిగనూరులో కూడా పెద్ద ఎత్తున రెస్పాన్స్ వచ్చింది. జగన్ లాగా ఏ సీఎం కూడా ప్రజల సంఖ్యలో పథకాలను సమర్ధవంతంగా అందించడం లేరని చాలామంది నమ్ముతున్నారు. ఆ కారణం చేత ఈసారి మళ్లీ జగన్ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: