ఏపీ : కాకరేపుతున్న కడప.. అవినాష్ ను ఓడించడానికి షర్మిల వ్యూహాలివేనా?

Reddy P Rajasekhar
ఏపీలోని కడప లోక్ సభ నియోజకవర్గంలో వైఎస్ ఫ్యామిలీ నుంచి ఒకే కుటుంబానికి చెందిన షర్మిల, అవినాష్ రెడ్డి పోటీ పడుతుండటం పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. షర్మిల సునీతను వెంటబెట్టుకుని జగన్, అవినాష్ లకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. నిందితుడైన అవినాష్ కు టికెట్ ఎలా ఇస్తారంటూ షర్మిల సంధిస్తున్న ప్రశ్నలకు వైసీపీ నుంచి సరైన కౌంటర్లు రావడం లేదు.
 
అవినాష్ రెడ్డిని ఓడించడానికి షర్మిల కొన్ని వ్యూహాలను అనుసరిస్తున్నారు. తాను రాజన్న బిడ్డనని ప్రచారం చేసుకుంటూ వైఎస్సార్ అభిమానుల మెప్పు పొందాలని భావిస్తున్న షర్మిల అవినాష్ రెడ్డిపై పదేపదే ఆరోపణలు చేయడం ద్వారా న్యూట్రల్ ఓటర్లను అవినాష్ రెడ్డికి దూరం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఎన్నికల సమయానికి విజయమ్మ మద్దతు పూర్తిస్థాయిలో తనకే ఉందని ఆమె చేత చెప్పించే దిశగా షర్మిల ప్లాన్స్ ఉన్నాయని తెలుస్తోంది.
 
భవిష్యత్తులో జగన్, అవినాష్ లపై మరింత ఘాటుగా విమర్శలు చేయాలని భావిస్తున్న షర్మిల జగన్ రియాక్ట్ కాకపోతే కూడా ప్రశ్నించాలని డిసైడ్ అయ్యారని సమాచారం. కడప టీడీపీ ఎంపీ అభ్యర్థిగా భూపేశ్ రెడ్డి పోటీ చేస్తుండగా కడప లోక్ సభ నియోజకవర్గంలో టీడీపీ మూడో స్థానానికే పరిమితం అయ్యే ఛాన్స్ ఉంది. అవినాష్ ను ఓడించడమే లక్ష్యమని చెబుతున్న షర్మిల అవినాష్ ను ఓడించినా ఓడించకపోయినా కడప ప్రజల్లో ఆయనపై వ్యతిరేకత పెంచే విషయంలో సఫలమవుతున్నారు.
 
అయితే ఇదే సమయంలో షర్మిల ప్రవర్తనపై కూడా కొన్ని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పొలిటికల్ కెరీర్ విషయంలో ఆమె చేసిన కొన్ని తప్పుల సంగతి ఏంటని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీతో షర్మిల రాష్ట్రంలో వైసీపీ ఓట్లను చీలుస్తుందా? లేక కూటమి ఓట్లను చీలుస్తుందా? అనే సందేహాలు సైతం ఉన్నాయి. షర్మిల గెలుపు కోసం ఏ స్థాయిలో ఖర్చు చేస్తారనే చర్చ సైతం జరుగుతోంది. షర్మిల వ్యక్తిగత జీవితాన్ని మాత్రం టార్గెట్ చేయకూడదని జగన్, అవినాష్ భావిస్తున్నారని తెలుస్తోంది. చెల్లిపై ఘాటు విమర్శలు చేస్తే ప్రత్యర్థులకు విమర్శించే ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుందని జగన్ ఫీలవుతున్నారని భోగట్టా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: