మహాసేన రాజేశ్‌కు మళ్లీ జలక్‌ ఇచ్చిన చంద్రబాబు?

Chakravarthi Kalyan
కులం అన్నది ఒక భావన. అది భ్రాంతిగా భావించిన వారిని వదలదు. పెద్ద పెద్ద కవులు, కళాకారులు, చరిత్ర కారులకే కులం కార్డు తప్పలేదు. ఇప్పటికీ ఆయా ప్రముఖులు తమ సామాజిక వర్గానికి చెందిన వారని ఇప్పటకీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం మనం చూస్తూనే ఉంటాం. అయితే రాజకీయాలకు వచ్చే సరికి ఇది వేరు. కులం అన్నది పెద్ద క్రెడిట్.

ఇది లేకపోతే నో పాలిటిక్స్ అన్నట్లు తయారు చేశారు. ఇలా తమ కులం పేరిట ఉద్యమాలు చేపట్టి ఫేమస్ అయిన ప్రముఖులు ఉన్నారు.  వీరిని రాజకీయ నాయకులు తమ పార్టీ అవసరాల కోసం వాడుకుంటూ ఉంటారు. ఇలా రాజకీయాలు చేయడంలో చంద్రబాబు ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు. సోషల్ మీడియా ద్వారా ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్న వారి లిస్ట్ లో మహా సేన రాజేశ్ తొలి స్థానంలో ఉంటారు. యూ ట్యూబ్ వేదికగా దళితలు సమస్యలపై మహాసేన రాజేశ్ తనదైన శైలిలో స్పందిస్తుంటారు.

ఈయన తాజాగా టీడీపీలో చేరి ఆ పార్టీ టికెట్ దక్కించుకున్నారు. ఈయన క్రేజ్ ను గుర్తించిన చంద్రబాబు పి.గన్నవరం ఖరారు చేశారు. దీంతో వ్యతిరేకత వ్యక్తం అయింది. వెంటనే ఆయన్ను పోటీ నుంచి తప్పించారు. దీనంతటకీ కారణం జగనే అని రాజేశ్ ఆరోపించారు. ఈయనతో పాటు జడ sravan KUMAR' target='_blank' title='శ్రవణ్ కుమార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">శ్రవణ్ కుమార్ కూడా రాజకీయాల్లో యాక్టివ్ గా మారారు.

వీరద్దరూ మాల సామాజిక వర్గానికి చెందిన నేతలు. ఆది నుంచి వీరంతా వైసీపీకి అనుకూలంగా ఉన్నారు. వీరిని ఎలాగైనా తమ వైపు తిప్పుకోని.. మాల సామాజిక వర్గానికి చెందిన ఓట్లను కొల్లగొట్టాలని చంద్రబాబు భావించి అందుకు అనుగుణంగా వ్యూహాలు రచించారు. కానీ ఇవన్నీ బెడిసికొట్టడంతో తాజాగా టీడీపీ నాయకుడు నక్కా ఆనంద్ బాబు అధ్యక్షతన మాల సంఘం నాయకులతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు.  వారి డిమాండ్లకు ఓకే చెప్పి..సైకిల్ పార్టీకి మద్దతుగా ఉండాలని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: