ఏపీ: దగ్గుబాటి పురందేశ్వరికి ఏమైంది.. ఎంత డిమాండ్స్ తో ఎన్నికల సంఘానికి లేఖ..??

Suma Kallamadi
ఏపీ రాజకీయవేత్త, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి చంద్రబాబు నాయుడుకి బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇటీవల ఆమె కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక లేఖ రాశారు అందులో ఏ అధికారిని తీసేయాలో ఏ అధికారిని ఉంచాలో ఆమె సజెషన్ చేశారు ఇది ఒక దారుణం అని చెప్పుకోవచ్చు. బావ కళ్ళల్లో ఆనందం చూసేందుకే ఆమె ఇంతకు తెగించారని అప్పట్లో పేర్ని నాని తదితరులు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. టీడీపీ మాత్రం సైలెంట్ గానే ఉంది.
అయితే ఎన్నికల సంఘం ఆమె రాసిన లేకపోయి యాక్టివ్‌గా చర్యలు తీసుకోలేదు. దానిని రాష్ట్ర ఎన్నికల సంఘానికి బదిలీ చేసి ఈ వ్యవహారం ఏంటో చక్కదిద్దాలని కోరింది. ఆ లేఖలో పురందేశ్వరి అధికారులు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని వారిని తీసేయాలని విజ్ఞప్తి చేశారు. అలానే ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న అధికారులను బదిలీలు చేయాలని ఆమె అడిగారు. ఏకంగా 22 ఐపీఎస్ అధికారులను  తీసేసి వారి స్థానంలో ఎవరిని భర్తీ చేయాలో కూడా ఆమె సలహా ఇవ్వడం విస్మయకరం. మరి రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ లేఖపై ఎలా స్పందిస్తుందో చూడాలి.
దగ్గుబాటి పురందేశ్వరి రాష్ట్రంలో తనకు ఇష్టం లేని అధికారులను పంపించేయమని ఇష్టం ఉన్న అధికారులను ఇక్కడికి తీసుకురావాలని అడగడం వింతగా ఉందని చాలామంది కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఎన్నికల సంఘాలు చిత్ర విచిత్రమైన డిమాండ్స్ చేసే లేఖలను డీల్ చేయలేక తలలు పట్టుకుంటున్నాయి. ముందుకు పోతే గొయ్యి వెనక్కి పోతే నుయ్యి అన్న చందానా ఎన్నికల సంఘం పరిస్థితి తయారయ్యింది.
ఇకపోతే ఏపీ అసెంబ్లీ ఎన్నికల తేదీ దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు చేస్తున్న కామెంట్స్ బాగా హైలైట్ అవుతున్నాయి. కోడలు మగ బిడ్డ కంటానంటే అత్త ఎందుకు వద్దు అంటుంది అని ఆడవారిని తక్కువ చేసేలా ఇటీవల కామెంట్స్ చేసి తప్పు చేశారు. ఇంతకుముందు వాలంటీర్ల వ్యవస్థను ఆపు చేయించి ఏపీ ప్రజల్లో ఆగ్రహానికి కారణమయ్యారు. కిరాణా షాపుల్లో డ్రగ్స్ అమ్ముతున్నారని నిరాధార ఆరోపణలు చేసి మరింతమందిని షాక్‌కి గురి చేశారు. ఒకవైపు సీఎం జగన్ మంచి ప్రసంగాలతో ప్రజలను మరింత ఆకట్టుకుంటుంటే చంద్రబాబు మాత్రం చాలా తప్పులు ఉన్న ఓటర్లను కూడా పోగొట్టుకునే పని చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: