ఏపీ: జగన్ కు చెల్లెలే కాదు వైఫ్ కూడా తలనొప్పిగా మారుతోందా?

Suma Kallamadi
ఏపీలో త్వరలో జరగబోయే ఎన్నికల కోసం ప్రతిపక్ష కూటమి, అధికార వైసీపీ పార్టీలు ఎవరి ప్రసారాల్లో వారు మునిగిపోయారు. అయితే ఈసారి ఎన్నికలు కోసం యావత్ ఆంధ్ర దేశం అంతా కూడా ఎంతో ఉత్సుకతతో ఎదురు చూస్తోంది. ఇంతవరకు జరిగిన ఎన్నికలు ఒక లెక్క... ఈ సారి ఒకలెక్క. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా జాగ్రత్తపడుతూ తెలుగుదేశం, బిజెపి, జనసేన పార్టీలు జతకట్టి కూటమిగా బరిలోకి దిగుతుండగా జగన్ మాత్రం ఒంటరిగానే ఎన్నికలకు వెళుతున్నారు. అయితే ఈ ఎన్నికలు జగన్ కు అంత ఈజీ కాదని తాజా సర్వేలు, రాజకీయ విశ్లేషకులే కాకుండా సామాన్య జనాలు కూడా చెబుతున్నారు.
అవును, ప్రత్యర్థి కూటమి సంగతి పక్కన బెడితే సొంత కుటుంబసభ్యులే ఈసారి జగన్ కు పక్కలో బల్లెంలా మారారు. విషయం ఏమిటంటే, ఇప్పటికే చెల్లి పోటుతో సగం తలనొప్పితో బాధపడుతున్న వైఎస్ జగన్ కు భార్య భారతి వ్యవహారం కొత్తగా మరో తలనొప్పి తెచ్చిపెట్టింది అని విశ్వసనీయ వర్గాల సమాచారం. జగన్మోహన్ రెడ్డి భార్య వైఎస్ భారతి సాధారణంగా మొదటినుండీ రాజకీయాలకు దూరంగా వుంటారు. అటు పుట్టినింటికి, ఇటు మెట్టినింటికి రాజకీయ నేపథ్యం ఉన్నప్పటికీ వున్నా ఆమె మాత్రం ఏనాడు రాజకీయాల వైపు చూడలేదనే చెప్పుకోవాలి. అయితే ఆమెను రాజకీయాలు వదలడం లేదు. భర్త ముఖ్యమంత్రి కావడం, పుట్టింటివారు కూడా వైసిపిలో వుండటంతో భారతి పేరు తరచూ మనకి వినబడుతూ ఉంటుంది. ఇక్కడ తలనొప్పి వ్యవహారం ఏమిటంటే వైఎస్ కుటుంబానికి కాకుండా తన పుట్టింటివారికి పదవులు ఇప్పించుకోవడంలో భారతి సక్సెస్ అయ్యారన్న ప్రచారం బయట వుంది.
అయితే ఆమె ప్రత్యక్ష రాజకీయాలలో లేనప్పటికీ వైఎస్ జగన్ ను వెనకుండి నడిపిస్తున్నది భార్య భారతే అని వైఎస్ కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. వైఎస్ జగన్ సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో దారుణ హత్యకు గురయ్యారు. అయితే ఈ హత్య వెనక వైఎస్ భారతి పాత్ర కూడా వుందని ఇపుడు ప్రచారం జరుగుతోంది. అవినాష్ రెడ్డికి ఎంపీ సీటు దక్కకుండా అడ్డుపడుతున్నాడనే వివేకాను హత్య చేసారని... ఈ హత్య విషయం వైఎస్ భారతికి ముందుగానే తెలుసునని వైసిపి ప్రత్యర్థుల వాదన. దాంతో భార్యపై వచ్చిన ఈ ఆరోపణలు ఇపుడు జగన్ మెడకు చుట్టుకున్నట్టు కనబడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: