ఏపీ: ప్రజలకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించిన చంద్రబాబు?

Suma Kallamadi
ఏపీలో ఎన్నికలు దగ్గరవున్న వేళ విపక్షాలు తమదైన రీతిలో ప్రజలను ఆకట్టుకోవడానికి ఆఫర్లను వరాలుగా ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఈ మందుటేసవిలో ఎండ వేడిని సైతం లెక్కచేయకుండా ఎన్నికల ప్రచారంలో తనదైన రాజకీయ చతురతకి ప్రదర్శిస్తున్నారు. టిడిపిని ఈ సారి ఎలాగన్నా అధికారంలోకి తీసుకురావాలని, వైసిపిని ఇంటికి పంపించాలనే లక్ష్యంతో సర్వశక్తులు వడ్డుతున్నారు. దీనిలో భాగంగానే వైసిపి ప్రభుత్వం ఈ ఐదేళ్లలో ఇచ్చిన సంక్షేమ పథకాలను చూసుకుని, అదే తరహాలో జనాలకి సంక్షేమ పథకాలను ఇళ్ల వద్దకే అందిస్తామని పదే పదే తన పర్యటనలో చంద్రబాబు చెప్పుకొస్తున్నారు.
ఈ మధ్య ముఖ్యంగా పెన్షన్ల పంపిణీ వ్యవహారంలో వాలంటీర్ల ద్వారా పెన్షన్లను ఇంటి వద్దే తీసుకునే అవకాశం లేకుండా, నిమ్మగడ్డ రమేష్ అడ్డుకోవడంపై జనాల్లో ఒకరకంగా టీడీపీపట్ల ఒకింత వ్యతిరేకత రావడం జరిగింది. ఆయా పరిణామాలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు పెన్షన్ల విషయంలో ఇపుడు అనేక హామీలు ఇస్తున్నారు. అవును, అసలు విషయం ఏమిటంటే టిడిపి అధికారంలోకి రాగానే ఈ 3 నెలల ఫించన్ చెల్లించడానికి ప్రభుత్వం ఇబ్బంది పెడితే.. తాము అధికారంలోకి రాగానే అంత కలిపి ఒకేసారి చెల్లిస్తామని చంద్రబాబు ఈ సందర్భంగా చెప్పుకు రావడం కొసమెరుపు. నెలకు 4వేల రూపాయల చొప్పున అంతా కలిపి జూలై నెలలో అధికారంలోకి రాగానే చెల్లిస్తామని చంద్రబాబు హామీ ఇస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే పెన్షన్ ల పంపిణీ విషయమై తాను చీఫ్ సెక్రటరీకి ఫోన్ చేసి ఆల్రెడీ చెప్పానని, అయినా ప్రభుత్వం పేదలను ఇబ్బంది పెట్టిందని చంద్రబాబు గుర్తుచేశారు. కావాలనే పెన్షన్ అంశాన్ని జగన్ ప్రభుత్వం రాజకీయం చేసిందని... దానికోసం వారిని సచివాలయానికి రమ్మని, వృద్ధులు, రోగులని చూడకుండా ఇబ్బంది పెట్టారని, ఇది మంచి విషయం కాదని తాను చెప్పినా వినిపించుకోలేదని చంద్రబాబు ఈ సందర్భంగా విరుచుకు పడ్డారు. కాగా దీనిపై ఎన్నికల కమిషన్ విచారణ చేయించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేసారు. ఇక టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం డిఎస్సి పైనే పెడతామని, వారు అధికారంలోకి వచ్చిన వెంటనే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, మహిళలకు అన్ని రకాలుగా అండగా ఉంటామని చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: