కేశినేని బ్రదర్స్ మధ్య వైరం అలా మొదలైందా.. ఇద్దరిలో సరైనోడు ఎవరంటే?

Reddy P Rajasekhar
ఒకే కుటుంబం నుంచి ఇద్దరు వ్యక్తులు వేర్వేరు పార్టీల తరపున ఎన్నికల్లో పోటీ చేయడం రాజకీయాల్లో కొత్తేం కాదు. అయితే సొంత సోదరులైన కేశినేని నాని, కేశినేని చిన్ని విజయవాడ లోక్ సభ స్థానం నుంచి ఒకరు వైసీపీ తరపున ఒకరు టీడీపీ తరపున పోటీ చేస్తుండటం గమనార్హం. విజయవాడ లోక్ సభ స్థానం నుంచి గెలిచే వ్యక్తి ఎవరంటూ విజయవాడ ప్రజల మధ్య జోరుగా చర్చ జరుగుతోంది.
 
కేశినేని నాని ఇప్పటికే వరుసగా రెండుసార్లు విజయవాడ నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. 2019 ఎన్నికల సమయంలో వైసీపీకి అనుకూల పరిస్థితులు ఉన్నా టీడీపీ నుంచి పోటీ చేసి కేశినేని నాని ఎంపీగా గెలిచారు. అయితే ఎన్నికల తర్వాత నాని వ్యవహార శైలి నచ్చకపోవడంతో 2024 ఎన్నికల్లో ఆయనకు టీడీపీ నుంచి టికెట్ దక్కలేదు. అదే సమయంలో కేశినేని నానికి వైసీపీ నుంచి టికెట్ విషయంలో హామీ లభించడంతో ఆయన వైసీపీ చేరి బాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.
 
కేశినేని నాని ఎంపీగా పని చేస్తున్న సమయంలో కేశినేని చిన్ని నాని ఎంపీ స్టిక్కర్ ను దుర్వినియోగం చేశాడని తెలుస్తోంది. అదే సమయంలో నాని పేరును వాడుకుని చిన్ని చేసిన కొన్ని పనులు ఆయనకు నచ్చలేదని సమాచారం. చిన్ని చేసిన పనులు నచ్చక ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయని భోగట్టా. కేశినేని నాని, కేశినేని చిన్ని మధ్య హోరాహోరీ పోరు ఉండనుందని ఇద్దరిలో గెలుపు ఎవరికి సొంతమవుతుందో కచ్చితంగా చెప్పలేమని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది.
 
ఇద్దరిలో ఒక్కరే పోటీ చేసి ఉంటే బాగుండేదని ఇద్దరినీ అభిమానించే ఓటర్లు చెబుతున్నారు. ఎవరు గెలిచినా మెజార్టీ స్వల్పంగానే ఉంటుందని కామెంట్లు వ్యక్తమమవుతున్నాయి. ప్రస్తుతం కేశినేని నాని, కేశినేని చిన్ని పేర్లు ఏపీలో మారుమ్రోగుతున్నాయి. ఏపీ రాష్ట్ర రాజకీయాలకు సైతం విజయవాడ కేరాఫ్ అడ్రస్ కాగా కేశినేని నాని, కేశినేని చిన్నిలలో ఇక్కడ విజయం సాధించి ఎవరు చక్రం తిప్పుతారో చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: