ఏపీ (ఉండి): రఘురామ Vs రామరాజు.. చిచ్చు పెడుతున్న టిడిపి..!

Divya
గడచిన రెండు రోజుల నుంచి కోస్తాంధ్ర , ఉత్తర కోస్తా రాజకీయాలను ఊపేస్తున్న రఘురామకృష్ణరాజు అంశం ఇప్పుడు ఉండి దగ్గరకొచ్చి అయితే ఆగింది.. కానీ ఉండిలోకి నో ఎంట్రీ అంటూ అక్కడ అడ్డుగా నిలబడ్డారు సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు.. దీంతో అక్కడ రామరాజు వర్సెస్ కృష్ణంరాజు కేరాఫ్ ఉండి అనేంతలా మారిపోయింది. సీట్ ఇచ్చి వెనక్కి తీసుకుంటే ఖబర్దార్ అంటూ అక్కడ రామరాజు అనుచరులు సైతం టిడిపి పార్టీని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా అక్కడ నేతలు "ఉండి అడ్డా రామరాజు అడ్డా" అనే నినాదంతో ధర్నాలు చేస్తున్నారు.

దీంతో rrr అడ్డా గా మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇప్పుడు టిడిపి హై కమాండ్ కే చుక్కలు చూపిస్తోంది ఉండి టికెట్ పోరు.. సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు.. సిట్టింగ్ ఎంపీ రఘురామకృష్ణరాజు మధ్య ఇంటర్నల్ ఫైట్ బాగా ముదిరి క్లైమాక్స్లోకి చేరింది. టిడిపి పార్టీలోకి చేరిన వెంటనే రఘురామకృష్ణరాజు రెగ్యులర్గా అధిష్టానంతో టచ్ లోనే ఉంటున్నారు ..నరసాపురం ఎంపీ సీటు దక్కకపోతే.. తన తర్వాత ఆప్షన్ ఉండి ఎమ్మెల్యే సీటు అని చెప్పకనే చెబుతున్నారట. మరోవైపు తన టికెట్ చేజారనివ్వకుండా పలు రకాల ప్రయత్నాలు చేస్తున్నారు రామరాజు.
పాలకొల్లులో చంద్రబాబు బస చేసిన చోటు చేరి నానా రచ్చ చేస్తున్నారు రామరాజు అభిమానులు అనుచరులు. అయితే వారిని సముదాయించలేక నానా అవస్థ పడుతున్నారు రామరాజు.. చంద్రబాబు అడిగితే తమ ప్రాణాలైనా ఇస్తాము కానీ రామరాజుకి టికెట్  కాదంటే టిడిపిని భూస్థాపితం చేస్తామంటూ టిడిపి అధిష్టానానికే వార్నింగ్ ఇస్తున్నారు ఉండి టిడిపి క్యాడర్..RRR రూపంలో వచ్చిన షాక్ లో ఉండిపోయారు ఉండి ఎమ్మెల్యే.. ఇప్పటివరకు చాలా ప్రశాంతంగా ఉన్న ఉండి నియోజకవర్గాన్ని ఒక్కసారిగా అట్టుడికిస్తున్నారు అంటూ ఆయన మాటలలో కనిపిస్తోంది. చంద్రబాబుతో భేటీ అయిన తర్వాత ఆ సీటు తమదే అనే అంత భరోసా ఇచ్చినట్టు ధీమాతో బయటికి వచ్చారు రామరాజు.. ఇక అనుచరులతో కలిసి కూడా భారీ ర్యాలీలు చేస్తున్నారు.. దీంతో అటు టిడిపి నేతను rrr ను డైలమాలో పడేలా చేసింది. దీంతో ఒక్కసారిగా కృష్ణరాజు వెనక్కి తగ్గినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈసారి rrr పోటీ కష్టమైనట్టుగా చర్చలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: