ఏపీ : అప్పుడలా ఇప్పుడిలా.. విలువలను తాకట్టు పెట్టడం రైటేనా షర్మిల?

Reddy P Rajasekhar
2024 ఎన్నికల్లో కడప పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున వైఎస్ షర్మిల బరిలో నిలవనున్నారనే సంగతి తెలిసిందే. మొదట తెలంగాణలో పార్టీ పెట్టిన షర్మిల అక్కడ అనుకూల ఫలితాలు వచ్చే పరిస్థితి లేకపోవడంతో వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఏపీ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. రాజన్న బిడ్డనంటూ కడపలో షర్మిల రాజకీయాలు చేస్తుండగా చూసేవాళ్లకు ఆమె చులకన అవుతున్నారు. వైఎస్ వివేకా హత్యను షర్మిల తన రాజకీయాల కోసం వాడుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
 
వివేకా హత్యోదంతం గురించి ఇష్టానుసారం మాట్లాడుతున్న షర్మిల కడపలో ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత డిపాజిట్ కూడా రాకపోతే ఏం చేస్తారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అభిమానించే వాళ్లు షర్మిలకు అండగా నిలబడటం లేదు. షర్మిల ప్రచార సభలకు 200 మంది కూడా హాజరు కావడం లేదంటే వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయో సులువుగా అర్థమవుతుంది.
 
చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కొరకే షర్మిల పని చేస్తున్నారని కడప పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. పొలిటికల్ గా ఎదగాలనే ఆలోచనతో షర్మిల సొంత అన్నపైనే కక్షగట్టారని చంద్రబాబుతో స్నేహం చేయడం ద్వారా విలువలను తాకట్టు పెట్టారని వైసీపీ అభిమానులు చెబుతున్నారు. గతంలో చాలా సందర్భాల్లో అవినాష్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడిన షర్మిల ఇప్పుడు ప్లేట్ ఫిరాయించారు.
 
పీసీసీ అధ్యక్షురాలు అయిన షర్మిల ప్రజాదరణ ఏ స్థాయిలో ఉందో తెలుసుకుంటే మంచిదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అవినాష్ రెడ్డి హంతకుడని షర్మిల మాట్లాడటం నైతికంగా ఎంతవరకు కరెక్ట్ అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. షర్మిల ఆత్మ పరిశీలన చేసుకుంటే వాస్తవాలు అర్థమవుతాయని వైఎస్సార్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. 2024 ఎన్నికలతో షర్మిల పొలిటికల్ కెరీర్ ముగిసినట్లేనని విశ్లేషకులు చెబుతున్నారు. షర్మిలకు వాస్తవాలు అర్థం కావడానికి ఎంతో సమయం పట్టదని పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాలనే నిర్ణయం ఆమె రాజకీయ భవిష్యత్తును నాశనం చేస్తుందని ఏపీ ప్రజల్లో చర్చ జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: