నిజామాబాద్ : అప్పుడు పసుపు.. ఇప్పుడు చక్కెర?

praveen
ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో హడావిడి మొదలైంది. ఇక విజయం సాధించడమే లక్ష్యంగా అన్ని పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఈ క్రమంలోనే ఇక ఈసారి బిఆర్ఎస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల్లో నిజాంబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ ను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో గులాబీ దళపతి కేసీఆర్ కూతురు పైన బిజెపి అభ్యర్థి అరవింద్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. అప్పుడు అధికారంలో ఉండి కూడా సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోలేకపోయింది బిఆర్ఎస్. ఇక అరవింద్ ఈసారి కూడా అదే పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత ప్రస్తుత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, టిఆర్ఎస్ నుంచి నిజాంబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజీ రెడ్డి గోవర్ధన్  పోటీ చేస్తున్నారు.

 అయితే నిజాంబాద్ లో ప్రస్తుతం బిజెపి కాంగ్రెస్ బిఆర్ఎస్ల మధ్య త్రిముఖ పోటీ ఉంటుంది అన్నది తెలుస్తుంది. అయితే గతంలో పార్లమెంట్ ఎన్నికల సమయంలో పసుపు బోర్డు వ్యవహారం ఎంతో కీలకంగా మారింది. 2014లో బిఆర్ఎస్ ఎంపీగా గెలిచిన కల్వకుంట్ల కవిత పసుపు బోర్డు తీసుకువస్తానని హామీ ఇచ్చారు. కానీ ఎంత ప్రయత్నించినా బోర్డు సాధించడంలో వైఫల్యం చెందారు. దీంతో 2019 లోక్సభ ఎన్నికల్లో ఆమె పోటీ చేసిన ఓటమి పాలయ్యారు. అంతేకాదు ఈ ఎన్నికల్లో 176 మంది పసుపు రైతులు నామినేషన్ వేయడం కూడా అప్పట్లో సంచలనగా మారింది.  ఇదే అంశాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న ధర్మపురి అరవింద్ 2019 పార్లమెంట్ ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీ కవితను ఓడించి విజయం సాధించారు.

 అయితే పసుపు బోర్డు కోసం అరవింద్ ఎంతగానో ప్రయత్నించగా కొంత మేరకు సక్సెస్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే స్వయంగా ప్రధాని మోదీ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో అరవింద్ కు ఇది కలిసి వచ్చే అంశమే. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో పసుపు బోర్డు వ్యవహారం అభ్యర్థుల జయాపజయాలను నిర్ణయించుగా.. ఇక ఇప్పుడు చక్కెర ఫ్యాక్టరీ వ్యవహారం తెరమీదకి వచ్చింది. ఈ  పార్లమెంటు ఎన్నికల్లో నిజాం చెక్కర ఫ్యాక్టరీ వ్యవహారం తెరమీదకి తెచ్చేలా ప్రధాన పార్టీలు సమయతమవుతున్నాయని తెలుస్తుంది. నిజాం షుగర్ ఫ్యాక్టరీలు బోధన్ మెట్పల్లిలో ఉన్నాయి. ఈ రెండు ఫ్యాక్టరీలను ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో చంద్రబాబు ప్రభుత్వం 2004లోనే ప్రైవేట్ పరం చేసింది. కానీ లాభాలు లేకపోవడంతో 2014లో కిరణ్ కుమార్ రెడ్డి హాయంలో ఈ ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. అయితే తాము అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే ఈ ఫ్యాక్టరీలను తెరిపిస్తామని బిఆర్ఎస్ గతంలో హామీ ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేకపోయింది.

 అయితే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో తనను గెలిపిస్తే 2025 లోపు షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తానని కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి చెబుతున్నారు. ఇక బిజెపి ఎంపీ అరవింద్ సైతం ఇక ఇప్పుడు ఇదే చక్కెర నినాదాన్ని పట్టుకున్నారు. షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని హామీ తోనే ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. అయితే గతంలో పసుపు బోర్డు తీసుకొస్తాము అని అరవింద్ హామీ ఇచ్చి ఇక నిలబెట్టుకున్న నేపథ్యంలో.. ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీ విషయంలో కూడా నిజాంబాద్ ఓటర్లు అరవింద్ ను నమ్మే అవకాశం లేకపోలేదు. అయితే అటు బిఆర్ఎస్ నుంచి బాజీరెడ్డి గోవర్ధన్ పోటీ చేస్తున్నప్పటికీ ఇక బిఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకత కారణంగా ఈయన గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయని అందరూ అనుకుంటున్నారట.అయితే నిజాంబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లోని ఏడు నియోజకవర్గాలలో కూడా అటు గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. ఇది కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అంశం. ఇక ప్రధాన పోటీ కాంగ్రెస్, బిజెపికి మధ్య ఉంది అన్నది తెలుస్తుంది. మరి ఎవరు గెలుస్తారు అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: