ఆ ఎమ్మెల్యే భార్య పాకిస్తానీ.. బిజెపి ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు?

praveen
ప్రస్తుతం దేశవ్యాప్తంగా అని రాష్ట్రాలలో కూడా పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగుతూ ఉంది. ఈ క్రమంలోనే ఇక ఆయా పార్టీల తరఫున బరిలోకి దిగిన అభ్యర్థులు అందరూ కూడా గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతూ ప్రచారంలో దూసుకుపోతూ హామీల వర్షం కురిపిస్తున్నారు అని చెప్పాలి. ఇక ఓటర్ మహాశయులను ఆకట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల బరిలో దిగిన అభ్యర్థులు అందరూ కూడా ప్రత్యార్థులు చేసిన తప్పులను ఎత్తిచూపుతో ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు.

 ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు ఇలా ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు చేసే వ్యాఖ్యలు అందరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉంటాయి. ఎంతోమంది ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటారు. అయితే ఇక్కడ బిజెపి ఎమ్మెల్యే ఇలాంటి వ్యాఖ్యలు చేయగా ఆయన చేసిన కామెంట్స్ కాస్త వివాదాస్పదంగా మారిపోయాయి. ఏకంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే భార్య ఇండియన్ కాదు పాకిస్తానీ అంటూ బిజెపి ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశాడు. కర్ణాటక రాజకీయాల్లో ఈ ఘటన చోటు చేసుకుంది.

 కర్ణాటక బిజెపి ఎమ్మెల్యే బసవగౌడ పాటిల్ చేసిన కామెంట్స్ ఏకంగా కర్ణాటక రాజకీయాల వివాదాస్పదంగా మారిపోయాయి. రామేశ్వరం కేఫ్ బాంబ్ బ్లాస్ట్ కేసులో బిజెపి కార్యకర్త అరెస్టు అవడంపై ప్రశ్నించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే దినేష్ గుండురావుపై మండిపడ్డారు బిజెపి ఎమ్మెల్యే బసవగౌడపాటిల్. దినేష్ ముస్లిం మహిళా తబుస్సుమ్ ను పెళ్లాడారు. ఆయన ఇంట్లో సగం పాకిస్తానీ ఉంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన. అయితే ఈ విషయంపై రెండు పార్టీల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగుతూ ఉండగా.. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యే దినేష్ భార్య స్పందించారు. నేను ముస్లింనే. కానీ నా భారతీయతను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు. ఇది నిజంగా అవమానకరం అంటూ ఫైర్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: