గుంటూరు : బాలయ్య బాబు స్నేహితుడికి 'జగన్' అవకాశం ఇస్తాడా..?

FARMANULLA SHAIK
ఏపీలో అసెంబ్లీ, లోకసభ ఎన్నికలు దగ్గరపడుతున్న కూడా ఇంకా గుంటూరు పార్లమెంట్ సీట్ విషయంలో అయోమయంలో వైసీపీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తుంది. గుంటూరు ఎంపీగా సెట్టింగ్ పొన్నూరు ఎమ్మెల్యే ఐనా కిలారి రోశయ్యను వైసిపి అధిష్టానం ప్రకటించింది. మొదట్లో ఉమ్మారెడ్డి కుమారుడు ఐనా వెంకటరమణను గుంటూరు ఎంపీగా జగన్ ఓకే చేసారు.కానీ కొన్ని కారణాల వల్ల వెంకటరమణ స్థానంలో కిలారి రోశయ్యను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు.ప్రస్తుతం రోశయ్య ఎంపీగా పోటీ చేసేందుకు ఇష్టపడట్లేదు అని తెలుస్తుంది.ఆయన ఇటీవల పార్టీ ముఖ్య నేత సజ్జలను కలిసి తనకు గుంటూరు పశ్చిమం లేదా పొన్నూరు స్థానం కావాలని అడిగినట్లు సమాచారం. గుంటూరు ఎంపీ అభ్యర్థిగా వేరేవాళ్లని ఎంపిక చేయాలని కోరినట్లు తెలుస్తోంది. దాంతో గుంటూరు ఎంపీగా ఎవరికి అవకాశం ఇవ్వాలనేది వైసిపిలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా ఉంది.
గుంటూరు లో సామాజిక సమీకరణాల్లో భాగంగా ఎంపీ స్థానం కాపు వర్గానికి ఇవ్వాలని జగన్ రోశయ్యను కేటాయించారు.అయితే రోశయ్య పోటీకి సుముఖంగా లేకపోవడం తో అదే వర్గానికి చెందిన మరోక నేతను వెతికే పనిలో పార్టీ పెద్దలు ఉన్నట్లు తెలుస్తుంది.దాంతో సినీ హీరో నందమూరి బాలకృష్ణ సన్నిహితుడు ఐనా కదిరి బాబురావును బరిలోకి దింపుతారని వైసీపీలో చర్చ జరుగుతుంది.ఆయన 2020లో వైసీపీలో చేరారు.ప్రస్తుత ఎన్నికల్లో ఆయనకు సీటు దక్కలేదు కనుక గుంటూరు నుంచి బాబురావును బరిలోకి దింపే ఆలోచనలో పార్టీ పెద్దలు ఉన్నట్లు సమాచారం.కాకపోతే ఆయన నాన్ లోకల్ కావడంతో అవకాశం ఇస్తారా లేదా అనేది అనుమానంగా ఉంది.అదే టైం లో మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పేరు కూడా తెర మీదకు వచ్చింది. ఏ విషయం అనేది ఉగాది తర్వాత సీఎం జగన్ గుంటూరు ఎంపీ అభ్యర్థి విషయంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టీ పెద్దలు చెప్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: