ఎన్నికల తర్వాత బీజేపీలో టీడీపీ, జనసేన విలీనం.. ?

RAMAKRISHNA S.S.
- బాబుతో బీజేపీ పొత్తు పెట్టుకోవడం వెనుక ఇదే షరతు ?
- కమలనాథుల డిమాండ్‌కు బాబు అంగీకరించాకే పొత్తు ?
- స్కిల్ డెవలప్మెంట్ సహా ఇతర కేసుల భయమే కారణం ?
జనసేను సైతం బీజేపీలో కలిపేందుకు పవన్ అంగీకారం ?
- ప‌వ‌న్‌కు రాజ్య‌స‌భ‌తో పాటు కేంద్ర స‌హాయ మంత్రి ప‌ద‌వి ?
( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )
రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నికల ఫలితాల తర్వాత కీలక పరిణామాలు జరగబోతున్నాయి. వైయస్ఆర్‌సీపీ రెండోసారి ఘన విజయం సాధించేలా ప‌రిణామాలు మారుతున్నాయి. అయితే ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ ఉండకవపోవచ్చని ప్రచారం జరుగుతోంది. 2014 ఎన్నికల ముందు బీజేపీతో కలిసి పనిచేసి.. ఆ తర్వాత యూటర్న్ తీసుకున్న చంద్రబాబు.. ప్రధాని మోడీ, అమిత్ షా సహా బీజేపీపై నోటీకొచ్చినట్టు మాట్లాడారు. ఆర్వాత 2019 ఎన్నికల్లో చంద్రబాబు పార్టీ ఘోర పరాజయం పాలవడం.. కేంద్రంలో మళ్లీ మోడీ భారీ మెజార్టీతో విజయం సాధించడం జరిగిపోయాయి.
ఆ తర్వాత కాలంలో చంద్రబాబు బీజేపీ పెద్దలతో సయోధ్య కోసం అనేకసార్లు ప్రయత్నించినా కనీసం ఢిల్లీ నుంచి అపాయింట్ మెంట్ కూడా వచ్చేది కాదు.  ప్రధాని మోడీతో కాదు కదా.. కనీసం అమిత్‌షాను కూడా చంద్రబాబు కలవలేకపోయారు. కానీ చంద్రబాబు స్కిల్ స్కామ్‌లో ఇరుక్కుని అరెస్టయిన తర్వాత.. బీజేపీకి పూర్తిగా లొంగిపోయారన్న ప్రచారం జరిగింది.
బాబు అరెస్టయిన తర్వాత ఢిల్లీ వెళ్లిన నారా లోకేష్ బీజేపీ పెద్దలను కలిసేందుకు ఎక్కనిగడప లేదు. కలవని నాయకుడులేదు. అంతలా ప్రయత్నించినా చివరకు కిషన్ రెడ్డి, పురంధేశ్వరి లాబీయింగ్‌తో అమిత్‌షాను లోకేష్ కలిశారు. అపట్లో లోకేష్ అమిత్ షాతో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆ భేటీలోనే టీడీపీని బీజేపీలో విలీనం చేయాలన్న ప్రతిపాదన తెరమీదికి వచ్చిందన్న ప్రచారం జరిగింది.
అదే సమయంల్ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్లారు.  బీజేపీలో జనసేన విలీనం చేయాలని బీజేపీ పెద్దలు పవన్‌ను అడిగినట్లు తెలుస్తోంది. టీడీపీనీ ఎన్డీయేలోకి తీసుకోవాలని పవన్ కోరినపుడే బీజేపీ నేతలు తమ ఆలోచన బయటపెట్టారని సమాచార. ఎన్నికల తర్వాత జనసేనను బీజేపీలో విలీనం చేస్తే.. ఏపీలో బీజేపీ బాధ్యతలు అప్పగిస్తామని హామీ ఇచ్చారని తెలుస్తోంది. అలాగే పవన్‌కు కేంద్ర మంత్రి పదవిని కూడా ఆఫర్ చేసినట్లు సమాచారం.
పవన్ కూడా చంద్రబాబును బీజేపీకి దగ్గర చేసేందుకు చేయాల్సిందంతా చేశారని అందరికీ తెలుసు. ఆతర్వాత బాబు అనారోగ్యం కారణం చూపి బెయిల్ రావడం.. ఢిల్లీ వెళ్లడంతోనే మరోసారి మూడు పార్టీల కూటమి ఖాయమైంది. కానీ టీడీపీని విలీనం చేస్తేనే పొత్తు ఉంటుందని మోడీ, అమిత్ షా తేల్చి చెప్పార‌ని ఆ త‌ర్వాతే ఈ ప‌రిణామాలు జ‌రిగాయంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: