ఏపీ: కర్నూలులో కాకరేపుతున్న వైసిపి వర్గ విభేదాలు.. ఇలా అయితే కష్టమే?

Suma Kallamadi
ఏపీలో ఎన్నికలు దగ్గరవుతున్న కొద్దీ అధికార పార్టీలో కలకలం మొదలవుతోంది. దానికి తోడు కర్నూలు జిల్లాలో వర్గ విభేదాలు పార్టీ అధినేత జగన్ కి తలనొప్పిగా మారాయి అనడంలో సందేహమే లేదు. ఇప్పటికే కర్నూలు అసెంబ్లీ నియోజక వర్గంలో పార్టీ 2 వర్గాలుగా విడిపోయి ఉండగా ఇపుడు కొత్తగా మరో తలనొప్పి పార్టీకి పక్కలో బల్లెంలాగా మారింది. కర్నూలు జిల్లా పార్టీ అధ్యక్షునిగా ఉన్న బివై రామయ్యను కర్నూలు పార్లమెంట్ వైకాపా అభ్యర్థిగా ఎంపిక చేయడంతో ఆయన స్థానం ఖాళీగా ఉన్న సంగతి విదితమే. అప్పటి వరకు రామయ్య మేయర్ గా కొనసాగారు. ఈ తరుణంలో అతనిని ఎంపి అభ్యర్థిగా ఎంపిక చేయడంతో ఆ స్థానంలో కురువ సామాజిక వర్గానికి చెందిన నగర పార్టీ అధ్యక్షురాలు సత్యనారాయణమ్మ వచ్చి చేరారు.
ఈమధ్యలో జిల్లా పార్టీ అధ్యక్ష పదవి మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డికి ఇవ్వనున్నట్లు పార్టీ లీక్ చేసింది. మేయర్ స్థానానికి ఎన్నికలు జరగాలంటే చాలా సమయం కావాలి. నిర్ణయాన్ని వెనక్కితీసుకుంటే రాజికీయంగా సమస్యలు వస్తాయని ప్రత్యామ్నాయ మార్గాలు వెతికింది. ఈ క్రమంలోనే కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో కీలకంగా ఉన్న కురువలను సంతృప్తి పరచడానికి  వైసీపీ అధిష్టానం సత్యనారాయణమ్మను జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా ప్రకటించింది. ఈ నిర్ణయంతోనే పార్టీలో చిచ్చు రేగిందని చెప్పుకోవాలి. విషయం ఏమిటంటే దాదాపు ఐదు సంవత్సరాలుగా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్న ఎస్వీ మోహన్ రెడ్డిని కాదని మరొకరిని అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టడాన్ని ఆయన వర్గం అశాంతిగా ఉందని భోగట్టా.
ఒక్కసారి వెనక్కి వెళితే 2019 ఎన్నికల్లో హఫీజ్ ఖాన్ గెలుపు కొరకు కోసం అప్పటి ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి గట్టిగానే ప్రయత్నించారు. ఎమ్మెల్యే హఫీజాఖాన్ గెలిచాక తోకముడిచారు. ఎస్వీ వర్గాన్ని పూర్తిగా పక్కన పెట్టేసారు. దీంతో వారిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో ఇద్దరికి కాకుండా కృష్ణా జిల్లా కలెక్టరుగా పని చేసిన ఐఏఎస్ అధికారి ఏఎం ఇంతియాజ్ అహ్మద్ తో రాజీనామా చేయించిన సీఎం జగన్ కర్నూలు వైసీపీ అభ్యర్థిగా బరిలో దింపారు. కర్నూలు టికెట్ ఆశించిన ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కి రాజ్యసభ సీటు ఇస్తానని, మాజీ ఎస్వీ మోహన్ రెడ్డికి వైసీపీ జిల్లా అధ్యక్ష పదవి ఇస్తామని ఆ పార్టీ అధిష్టానం హామీ ఇచ్చింది. దీంతో ఇద్దరు కూడా ఇంతియాజ్ తో కలసి ప్రచారం చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: