ఏపీ: నెల్లూరు రాజకీయాలనే మలుపు తిప్పనున్న దంపతులు ..!

Divya
ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు రాజకీయాలలో త్వరలో ఒక పెను సంచలనమే జరగబోతోంది అన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.. ముఖ్యంగా వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన పెద్ద నాయకులు సైతం తిరిగి మళ్లీ జగన్ చెంతకి చేరుతున్నట్లు తెలుస్తోంది.. నెల్లూరు జిల్లాలో ఈ విషయం మాత్రం తెగ వైరల్ గా మారుతోంది.. టిడిపిలో కి చేరిన వారందరికీ ఇష్టం లేకపోవడంతో పాటు ప్రజల నుంచి వారికి తగిన ఆదరణ లభించకపోవడంతో తిరిగి మళ్ళీ వైసిపి గూటికి చేరేందుకు అధికార పార్టీతో చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది..
అయితే తిరిగి వైసీపీలోకి చేరడానికి ఇష్టపడుతున్న వారు ఎవరో కాదు వేమిరెడ్డి దంపతులే.. ఈ దంపతులకు ఎంతో గౌరవం ఇచ్చేవారు ప్రజలు.. నేరుగా సీఎం జగన్ తో మాట్లాడేంత స్వేచ్ఛ , స్వాతంత్రం కూడా కలిగి ఉన్న దంపతులు వీరు.. భార్య భర్తలు ఇద్దరికీ కూడా పదవులు దక్కాయి.. అయితే క్షణికావేశంతో పార్టీకి దూరం కావాలనే నిర్ణయం తీసుకున్నప్పుడు టిడిపిలో చేరారు.. ఆ పార్టీ తరఫున ఎంపీ , ఎమ్మెల్యే అభ్యర్థులుగా భార్యాభర్తలు దిగారు.. కానీ క్షేత్రస్థాయిలో ప్రజాధరణ లేకపోవడంతో తాము రాజకీయంగా తప్పుడు నిర్ణయం తీసుకున్నట్లు ఆలస్యంగా గుర్తించినట్లు తెలుస్తోంది..

దీంతో ఒక్కసారిగా ఈ దంపతులు పురాణాలోచనలో పడ్డారని అక్కడ విశ్వనీయ వర్గాల వారు తెలియజేస్తున్నారు.. నామినేషన్లు వేసే సమయానికి నెల్లూరు జిల్లాలలో ఒక పెద్ద సంచలనమే జరిగేలా ఆ జిల్లాలో వార్తలు వినిపిస్తున్నాయి.. టిడిపిలో వెన్నుపోటు రాజకీయాలను భరించలేక వీరు ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.. ముఖ్యంగా సున్నితమైన మనసులైన ఈ దంపతులు అనవసరంగా పార్టీ మారి ఏరికోరి ఇబ్బందులను తెచ్చుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.. ముఖ్యంగా వైసీపీలో కూడా వీరి పైన ఎలాంటి వ్యతిరేకత లేకపోవడంతో తిరిగి తీసుకోవడానికి కూడా అధికార పార్టీ అభ్యంతరం లేకపోయినట్లు తెలుస్తోంది. మరి నెల్లూరు జిల్లాలో రాబోయే రోజుల్లో ఏమైనా జరగొచ్చు అనే చర్చ కూడా విపరీతంగా కొనసాగుతోంది.. మరి వీటన్నిటికీ కాలమే సమాధానం చెబుతుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: