ఏపీ: ఎన్నికలవేళ పెన్షన్ రాజకీయం... దెబ్బకి 33 మంది వృద్ధులు బలి?

Suma Kallamadi
ఏపీలో ఎన్నికలవేళ పెన్షన్ రాజకీయం పెను దుమారాన్ని సృష్టిస్తోంది. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ యుద్ధానికి సై అంటూ రాళ్లు రువ్వుకుంటున్నారు. దానికి వృద్ధుల పెన్షన్ల కేంద్రాలు వేదికలయ్యాయి. వైసీపీ చేసిన రాజకీయం పుణ్యమా అని 33 మంది వృద్ధులు చనిపోయారు అని కూటమి ఆరోపిస్తే, లేదు బాబు చేసిన రాజకీయానికే పాపం వారంతా బలైపోయారని కామెంట్స్ చేస్తున్నారు. ఇక మూడో తేదీ నుంచే పెన్షన్లు ఇస్తామని వారం రోజుల ముందుగా ప్రకటించినా వాలంటీర్ల ద్వారా వద్దని ఈసీ ఇచ్చిన ఆదేశాలతో వైసీపీ రాజకీయానికి తెరలేపింది. ఈ క్రమంలోనే వృద్ధులను మానసికంగా టార్చర్ చేసారు అని ప్రతిపక్షం ఆరోపణ.
ఇక పెన్షన్ ఇస్తున్న రోజు సచివాలయాల వద్దకు అనేక మంది పరుగులు తీసిన ఘటనలు మీరు చూసే వుంటారు. ఈ నేపథ్యంలోనే పలు చోట్ల 33 మంది వృద్ధులు చనిపోయారని వినికిడి. అయితే ఇక్కడ ఆ చనిపోయిన మనుషులు మాత్రం ఎవరన్న విషయం ఆ దేవుడికి తప్ప ఇంకొకరికి తెలియదు. ఏదిఏమైనా నేడు ఆంధ్ర రాజకీయం శవాల ఊరేగింపులు నడుమ జరుగుతోంది అనడంలో సందేహమే లేదు. ఇది నేతలు సిగ్గు పడాల్సిన విషయం అంటూ కొంతమంది విమర్శకులు భావిస్తున్నారు. ఖజానాలో ఉన్న డబ్బులన్నీ కాంట్రాక్టర్లకు వదిలేసి, ముసలివాళ్ళ పెన్షన్లకు మాత్రం, అప్పుల మీద ఆధారపడింది ఈ వైసీపీ ప్రభుతం అని బాబు, కొడుకులు ఊరేగుతూ మాట్లాడుతుంటే, సొంత మామనే లేపేసిన బాబుకి ఈ అవ్వాతాతలు ఒక లెక్కా అని జగన్ బస్సు యాత్రలో మైకులు పగిలిపోయేలా మాట్లాడుతున్నాడు.
ఏది ఏమైనా గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తున్నది రాక్షస రాజకీయం అని రాజకీయ ఉద్దండులు మాట్లాడుకుంటున్నారు. వృద్ధుల ప్రాణాలు పోకున్నా వారు చనిపోవాలని నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడుతున్నారు. వృద్ధుల శవాల కోసం కాచుకు కూర్చున్న వైసీపీ నేతలు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రాజకీయం చేస్తే బావుంటుంది, లేదంటే రాబోయే ఎన్నికల్లో డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమని అంటున్నారు. అదేవిధంగా సగటు వృద్ధుడు అయిన బాబు ఈ వృద్ధాప్య రాజకీయం మానుకుంటే ఆరోగ్యానికి మంచిదని సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: