ఏపీ: పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కొత్త ఇల్లు... ఇళ్ళలగ్గానే సంబరమా?

Suma Kallamadi
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న సంగతి అందరికీ తెలిసినదే. గతంలో చేదు అనుభవాలు చవిచూసిన అయన ఈసారి ఎలాగైనా అక్కడి నుంచి గెలిచేందుకు అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీ మద్దతుతో ఈసారి పిఠాపురం నుంచి అయన ఖచ్చితంగా గెలిచి తీరుతానని ధీమాగా ఉన్నారు. దానికి ఈ మధ్య కొన్ని మీడియా చానళ్ళు చేసిన పబ్లిక్ టాక్స్ నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ఇక తాను గెలిచాక తిరిగి హైదరాబాద్ వెళ్లిపోతానన్న ప్రత్యర్ధుల ప్రచారంపై ఆయన ఫోకస్ పెట్టినట్టు కనబడుతోంది. దీంతో స్ధానికంగా ఉండేందుకు ఓ కొత్త ఇల్లు కొనుక్కున్నారు.
పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా స్ధానికంగా ఉంటూ మధ్యలో హైదరాబాద్ వెళ్లి వచ్చేలా పవన్ కళ్యాణ్ ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నట్టు కనబడుతోంది. ఈ క్రమంలోనే నియోజకవర్గం పరిధిలోకి వచ్చే గొల్లప్రోలు మండలంలోని చేబ్రోలు గ్రామంలో కొత్తగా నిర్మిస్తున్న నాలుగు అంతస్ధుల ఇల్లు తీసుకోవడం జరిగింది. ఓదూరి నాగేశ్వరరావు అనే వ్యక్తి నిర్మిస్తున్న ఈ ఇంటిని పవన్ కొనుగోలు చేశారా లేక లీజుకు తీసుకున్నారో మాత్రం ఇంకా అధికారికంగా తెలియాల్సి వుంది. కానీ ఏది ఏమైనా చేబ్రోలు గ్రామంలో మాత్రం పవన్ ఇల్లు తీసుకున్నట్లు అయితే నిర్దారణ అయింది. త్వరలో ఈ ఇంట్లో పవన్ గృహప్రవేశం చేయబోతున్నట్లు కూడా జనసేన వర్గాలు చెబుతున్నాయి.
అయితే, ఈ విషయాలు తెలిసిన అధికార వైసీపీ వర్గం మాత్రం ఇళ్ళలగ్గానే సంబరాలు చేసుకోవడమా? చాలా చోద్యంగా వుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే ఇంకా ఎన్నికలే కాలేదు. గెలవడం తరువాత సంగతి.. ముందు ఓడిపోకుండా ఉండడానికి కృషి చేయాలి కదా అన్నట్టు పవన్ పై కౌటర్లు వేస్తున్నారు. వాస్తవానికి పవన్ పిఠాపురంలో ఎంట్రీ ఇవ్వగానే తొలిరోజే తాను స్ధానికంగా ఉండాలనుకుంటున్నట్లు చెప్పడం జరిగింది. అందుకోసం ఏదో ఒక గ్రామంలో ఇల్లు కొనుక్కునేందుుకు వెతుకుతున్నట్లు కూడా బాహాటంగానే తెలిపారు. అన్నట్లుగానే ఇప్పుడు చేబ్రోలులో పవన్ ఇల్లు తీసుకున్నారు. ఇంకా ఉగాదికి పవన్ ఈ ఇంట్లోకి మారే అవకాశం ఉందని కూడా జనసేన వర్గాలు చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: