భారత్: అమెరికాను సైతం లెక్క చేయని మోదీ.. ఆ విషయంలో తగ్గేదేలే..??

Suma Kallamadi
భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశ భవిష్యత్తు కోసమే అనునిత్యం పాటుపడుతుంటారు. ఎవరినీ లెక్క చేయకుండా దేశ బాగోగుల కోసమే పని చేస్తుంటారు. ఇతర విషయాలన్నీటి కంటే దేశ ప్రయోజనాలనే ముందుంచే సమర్థవంతమైన నాయకుడు మోదీ. దేశం కోసం అమెరికా, రష్యా.. ఇంకా ఏ దేశమైనా సరే దానిని ఎదిరించడానికి వెనకాడరు. అహంకారంగా కనిపించకుండానే ఇతర దేశాలను తన దారిలోకి ఎలా తెచ్చుకోవాలో మోదీకి బాగా తెలుసు.
రష్యా ఉక్రెయిన్ దేశంపై యుద్ధం మొదలుపెట్టాక అమెరికా రష్యాకి బాగా వ్యతిరేకంగా మారింది. క్రూడాయిల్‌ ను ఆ దేశం నుంచి దిగుమతి చేసుకోవద్దని ఇండియాకు చాలాసార్లు చెప్పి చూసింది. రష్యాను దెబ్బ తీయాలనే ఉద్దేశంతోనే అమెరికా ఇలా భారత్‌ను బలవంత పెట్టింది. ఆంక్షలు కూడా విధించింది. పెట్రోల్ దిగుమతులను ఆపాలని బాగా ప్రయత్నించింది కానీ మోదీ అమెరికా దేశ డిమాండ్స్ కు అస్సలు లొంగలేదు. చమురును ఎప్పటి లాగానే కొనుగోలు చేశారు.
140 కోట్ల మంది జనాభా ఉన్న భారత్ చమురు విషయంలో రష్యాపై కాకుండా ఇతర దేశాలపై ఆధారపడితే చాలానే ఇబ్బందులు వస్తాయి. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్‌కు రూ.250 వరకు పెరిగే అవకాశం ఉంది. అమెరికా మెప్పు పొందేందుకు మోదీ అలా చేసి ఉంటే ఇండియా అల్లకల్లోలమై ఉండేది. వీటన్నిటిని ఆలోచించే మోదీ దిగుమతులను ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నారు. బ్లూమ్‌బెర్గ్ లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం, ఇండియా రష్యా నుంచి ఈ ఏడాది ఏడు శాతం ఎక్కువగా పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేస్తోంది. నిజానికి యుద్ధం మొదలైన సమయం నుంచి రష్యా దగ్గర ఎక్కువగా ఆయిల్ కొనడం చేస్తోంది భారత్. అలా కొనుగోళ్లను పెంచుకుంటూ వెళ్తోంది. ఏడు శాతం కొనుగోళ్ల రేటు పెరిగినట్లు లేటెస్ట్ రిపోర్ట్ వెల్లడించింది.
 ఇండియా ఇప్పట్లో రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్స్ ను ఆపేది లేదని యూఎస్ మీడియా రిపోర్ట్స్ కూడా స్పష్టంగా చెబుతున్నాయి. మొత్తం మీద మోదీ దేశ ప్రజలను ఇబ్బందుల్లో పడేయకుండా జాగ్రత్తగా పరిపాలన చేస్తున్నారు. చమురు దిగుమతుల విషయంలో తగ్గేదేలే అన్నట్లు ప్రవర్తిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: