రాయలసీమ: నాయకుడంటే ఇతడే.. కమిట్మెంట్ కి సలాం..!
పరిటాల శ్రీరామ్ తమ అనుచరులకు సర్ది చెప్పడమే కాకుండా ధర్మవరం బిజెపి అభ్యర్థి సత్య కుమార్ యాదవ్ ను కలిసి ప్రచారాన్ని కూడా మొదలుపెట్టారు.. ప్రచారంలో భాగంగా సత్య కుమార్.. ఎమ్మెల్యే కేతిరెడ్డి పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.. ఈయనకు పరిటాల శ్రీరామ్ కూడా సపోర్టుగా నిలవడం గమనార్హం. సత్య కుమార్ ధర్మవరానికి వస్తున్న సందర్భంలో శ్రీరామ్ ఆధ్వర్యంలో నియోజవర్గంలో కొన్ని వందలాది వాహనాలతో అక్కడ ప్రదర్శనలు చేసినట్లు తెలుస్తోంది.. అలా బత్తలపల్లి మండలం లో సత్య కుమార్ కు పరిటాల శ్రీరామ్ తోపాటు టిడిపి , బిజెపి, జనసేన నాయకులు చాలా ఘనంగా స్వాగతం పలికారు.
ధర్మవరం ముఖ ద్వారం వద్ద గజ మాలలతో సత్యకుమార్ ను ఆహ్వానించారు. దారి పొడుగునా పరిటాల శ్రీరామ్ అనుచరులు, ప్రజలు సత్య కుమార్ కు స్వాగతం పలకడంతో ఆయనే ఆశ్చర్యపోయి పరిటాల శ్రీరామ్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. శ్రీరామ్ ధర్మవరానికి చేరుకున్న తర్వాత అక్కడ రైతులు, కూలీలు పడుతున్న ఇబ్బందులకు పరిష్కారం దొరకాలి అంటే కచ్చితంగా సత్యకుమార్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగు పెట్టాలని తెలియజేశారు. సత్య కుమార్ గెలుపు హస్తినాలో వినపడాలి అంటూ స్పష్టం చేశారు. ఇక్కడి ప్రజల భద్రత రక్షణకు ఎటువంటి ఇబ్బంది లేదని శ్రీరామ్ వెల్లడించారు. ఎమ్మెల్యేగా ఎన్ని రోజులు చేసినా.. కేతిరెడ్డి అరాచాకాలకు మరో రెండు నెలలలో పులి స్టాప్ పెడదాం అంటూ శ్రీరామ్ తెలియజేశారు.. సత్య కుమార్ను గెలిపించాల్సిన బాధ్యత ప్రతి టిడిపి కార్యకర్తకు ఉందంటూ శ్రీరామ్ పిలుపునిచ్చారు. ఏదేమైనా అధికార పార్టీలో ఉన్న కేతిరెడ్డిని ఎలాగైనా సరే ఓడించాలని , ప్రజలకు మంచి చేకూర్చాలని, తనకు సీటు దక్కకపోయినా సరే బిజెపి వ్యక్తితో చేతులు కలిపి కూటమిలో భాగంగా ప్రచారాలు నిర్వహిస్తూ.. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు పరిటాల శ్రీరామ్.. ఇక అసలైన నాయకుడు అంటే ప్రజల కోసం పోరాడాలి తప్ప పదవి కోసం కాదు అంటూ మరోసారి నిరూపించారు.