ఏపీ : వైసీపీ గెలిచినా ఓడినా జగన్ హీరోనే.. ఎవరూ సాటిరారుగా!

Reddy P Rajasekhar
ఏపీలో ఎన్నికలు జరగడానికి ఎంతో సమయం లేదు. నాలుగో విడతలో ఎన్నికలు జరగడం వల్ల టీడీపీ కంటే వైసీపీకే బెనిఫిట్ కలుగుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ బీజేపీ జనసేన పొత్తు పెట్టుకున్నా ఈ ఎన్నికల్లో వైసీపీని ఓడించడం సులువు కాదని సర్వేలలో వెల్లడవుతూ ఉండటంతో వైసీపీ గెలిచినా ఓడినా జగన్ హీరోనే అని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
 
వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తే టీడీపీ, జనసేన పార్టీల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. ఒకవేళ వైసీపీ ఎన్నికల్లో ఓడిపోయినా మూడు పార్టీల పొత్తు వల్ల దక్కిన గెలుపు నైతికంగా గెలుపు కాదని విమర్శలు వినిపించే ఛాన్స్ ఉంది. వాస్తవానికి 2014 ఎన్నికల సమయంలో కూడా వైసీపీ అధికారంలోకి వస్తుందని చాలామంది భావించారు.
 
ఆ సమయంలో కోస్తాంధ్ర జిల్లాలలో జగన్ పై తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉండేది. ఇతర పార్టీల నేతలు జగన్ పై తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు చేయడంతో మెజారిటీ ప్రజలు ఆ ఆరోపణలు నిజమని నమ్మారు. రుణమాఫీ హామీ ఇవ్వకపోవడం వల్ల తాను ఓడిపోయానని జగన్ భావించగా ఓటమికి అసలు కారణం మాత్రం ఇదేనని చెప్పవచ్చు. ఆ తర్వాత జగన్ ప్రజల సమస్యలను తెలుసుకుని ప్రజలకు మేలు చేసే హామీలను ప్రకటించి 2019 ఎన్నికల్లో లక్ష్యాన్ని సాధించారు.
 
 జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కరోనా వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే ఆ ఇబ్బందులను అధిగమించి పాలన సాగించడం జగన్ కు ప్లస్ అయింది. ఐదేళ్ల కాలంలో తనపై వచ్చిన విమర్శలకు ఒక్కొక్కటిగా చెక్ పెడుతూ జగన్ ముందడుగులు వేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాడు నేడు కార్యక్రమం ద్వారా జగన్ తెచ్చిన విప్లవాత్మక మార్పుల వల్ల విద్యార్థులు తమ లక్ష్యాలను సులువుగా సాధిస్తామని నమ్ముతున్నారు. ఎక్కువ షరతులు లేకుండానే పథకాలను అమలు చేసిన విషయంలో జగన్ కు ఎవరూ సాటిరారని నెటిజన్లు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: