ఏపీ: ఆ వైసీపీ అభ్యర్థి ఆస్తులు ఇక గల్లంతేనా? ఎల్‌ఐసీ ఏం చెబుతోంది?

Suma Kallamadi

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక రాజకీయ భవితవ్యం ఇపుడు అయోమయంలో పడింది. విషయం ఏమిటంటే ఆమె ప్రధాన భాగస్వామిగా ఉన్న బుట్టా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేటు లిమిటెడ్‌, మరికొన్ని సంస్థల ఆస్తులను మే 6న ఈ-వేలం వేయనున్నట్లు విశ్వసంయ వర్గాల సమాచారం. ఈ మేరకు హైదరాబాద్‌లోని ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ నిన్న గురువారం ఓ ప్రకటన విడుదల చేయడం ఇపుడు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. వ్యాపార అవసరాలకు ఆమె కొన్నేళ్ల కిందట ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ నుంచి రూ.340 కోట్ల రూపాయిల అప్పుని తీసుకున్నారట. కొవిడ్‌ సమయంలో పలు వ్యాపారాలు దెబ్బతినగా, కొన్నింటిని మూసివేయాల్సి వచ్చింది. ఆ ప్రభావం బుట్టా ఇన్‌ఫ్రాతోపాటు ఇతర సంస్థలపై పడడంతో ఆమెకి ఈ దుస్థితి వచ్చిందని సమాచారం.
అవును, రుణ బకాయిలు భారీగా పేరుకుపోవడంతో తాకట్టు పెట్టిన ఆస్తులను వేలం వేయాలని ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ సంస్థ ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. బకాయిల చెల్లింపు అంశంపై నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌(ఎన్సీఎల్టీ)లో ఉంది. ఈ నేపథ్యంలో వేలం ప్రకటన ఇవ్వడం కొసమెరుపు. కాగా విషయం ఎన్సీఎల్టీలో ఉండగా వేలం ప్రకటన విడుదల చేయడం నిబంధనలకు విరుద్ధమని బుట్టా రేణుక దంపతులు అయితే మీడియా వేదికగా వారి గొడ్డుని విన్నవించుకున్నారు. ఈ క్రమంలోనే వేలం ప్రక్రియ నిలిపివేసేలా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని, కేసు గెలుస్తామని కూడా ధీమాని వ్యక్తం చేసారు. ఇక ఏపీలో ఎన్నికల వేళ ఈ తంతు ఎక్కడి వరకు వెళుతుందో చూడాలి మరి!
ఇకపోతే ఆమె కర్నూలు లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యురాలిగా 2014 భారత సార్వత్రిక ఎన్నికలలో గెలుపొందిన సంగతి అందరికీ తెలిసినదే. ఆమె యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందింది. అదేవిధంగా ఆమె భర్త బుట్టా నీలకంఠం తెలుగుదేశం పార్టీ నాయకుడు. ఆమె 300 కోట్లకంటే ఎక్కువ ఆస్థులు గల ధనికురాలైన పార్లమెంటు సభ్యులలో ఒకరిగా పేరు తెచ్చుకొని ఇపుడు అప్పుల్లో కూరుకుపోవడం కాస్త అతిశయమేనని ప్రత్యర్థి రాజకీయ నాయకులు చెవులు కొరుక్కుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: