ఏపీ: అసలు పురంధరేశ్వరిని టార్గెట్ చేస్తున్నదెవరు..? బాబు స్కెచ్ అయితే కాదుకదా..?

Suma Kallamadi

ఏపీలో ఎన్నికల వేళ కొన్ని రాజకీయ పరిణామాల మధ్య టీడీపీ, జనసేన, బీజేపీ ఒక కూటమిగా ఏర్పడిన సంగతి అందరికీ తెలిసినదే. ఈ నేపథ్యంలో ఆయా కూటమికి చెందినటువంటి బీజేపీ అధ్యక్షురాలు పురంద్రీశ్వరి ఎక్కువగా ట్రోలింగ్ కి గురవుతోంది అనేది నిర్వివాదాంశం. అవును, కూటమి ఏర్పాటు చేసిన నాటి నుండి ఆమెపై విమర్శలు చేసే వారు ఎక్కువయ్యారు. వారిలో వైసీపీ నేతలు మాత్రమే కాకుండా ఆ పార్టీకి చెందని అభిమానులు కూడా సోషల్ మీడియాలో పురంద్రీశ్వరిని అనేక రకాలుగా కామెంట్స్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు. పురంద్రీశ్శరి బీజేపీ అధ్యక్షరాలు అయ్యాక వైసీపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటూ వెళుతున్నారని వైసీపీ ఆరోపణ చేస్తున్నమాట విదితమే. అందులోనూ మరీ ముఖ్యంగా చంద్రబాబు స్కిల్ డెవెలెప్‌మెంట్ స్కామ్ లో అరెస్టయిన తర్వాత ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఆమె ఎక్కువ చేస్తోందని అంటున్నారు.
అయితే చిన్నమ్మ ఎంత కష్టపడినా ఫలితం లేదని, బాబు తన జుత్తులమారి నక్క బుద్ధిని పోగొట్టుకోడు అని విమర్శలు గుప్పిస్తున్నారు ప్రత్యర్ధులు. ఆ ప్లానులో భాగంగానే ఆమెని రకరకాలుగా ట్రోల్స్ కి గురయ్యేలా చేస్తున్నారని అంటున్నారు. ఇప్పటికైనా చిన్నమ్మ మారితే రాజకీయ భవిష్యత్తు ఉంటుందని, లేదంటే బాలకృష్ణ మాదిరి భజన చేసుకుంటూ తిరగాల్సిందేనని విమర్శలు చేస్తున్నారు. మరోవైపు పొత్తు కుదిరిన తర్వాత ఏపీలో జరిగిన సభలో ప్రధాని నరేంద్ర మోదీ జగన్ పై నేరుగా విమర్శలు చేయకపోవడం చూసైనా ఇటువంటి నేతలకు గేమ్ అర్ధం కావాలని సూచిస్తున్నారు.
చిన్నమ్మ ఏపీ రాజకీయాల్లోనే కూడా కూటమిలో క్వీన్ గా మారాలని చూస్తే భంగపాటు తప్పదని నెట్టింట వైసీపీ అభిమానులు బాహాటంగానే ట్రోల్ చేస్తున్నారు. విషయం ఏమిటంటే 22 మంది అధికారులను మార్చాలని కేంద్ర ఎన్నికల కమిషన్ కు పురంద్రీశ్వరి లేఖ రాసిన సంగతి అందరికీ తెలిసినదే. వారి స్థానంలో ఎవరిని నియమించాలో కూడా బాబు దర్శకత్వంలో చిన్నమ్మ సూచించిందని అంటున్నారు. చంద్రబాబు డైరెక్షన్లో ఇంకెన్నాళ్లు నడుస్తారని ప్రశ్నిస్తున్నారు వైసీపీ నెటిజనం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: