జగన్: వై నాట్ 175 కాదు.. వై నాట్ 200.. అదే టార్గెట్..?

Divya
వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.. ఎన్నికలకు ముందు వైనాట్ 175 అనే నినాదంతో ముందుకు వెళ్లారు.. అయితే ప్రస్తుతం బస్సు యాత్ర చేస్తున్న సందర్భంగా.. ఈ క్రమంలోనే క్షేత్రస్థాయిలో పరిస్థితులు చూసిన తర్వాత ఆయనలో భరోసా ఏర్పడిందో ఏమో తెలియదు కానీ ప్రస్తుతం సరికొత్త నాంది పలుకుతున్నారు.. అదేమిటంటే గత రెండు రోజులుగా ఆయన ప్రసంగాలు వింటే ఈ విషయం చాలా స్పష్టమవుతుంది.. నిజానికి రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు మాత్రమే ఉన్నవి..

కానీ సీఎం జగన్ మోహన్ రెడ్డి  మాత్రం వైనాట్ 200 స్థానాలు అనే ప్రచారం చేస్తున్నారు.. దీంతో చాలామందిలో 200 స్థానాలు ఎక్కడివి అనే ప్రశ్న కూడా మొదలవుతోంది.. ఏపీలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 25 ఎంపీ స్థానాలు ఉన్నవి.. వీటన్నిటిని కలుపుకొని సీఎం జగన్ 200 స్థానాలని ప్రచారం చేస్తున్నారు.. ఇప్పుడు డబుల్ సెంచరీ అనే నిదానంతో ఎన్నికల ప్రచారంతో పెద్ద ఎత్తున ముందుకు సాగుతున్నారు సీఎం జగన్.. పెత్తందారులకు,  సామాన్యులకు మధ్య జరుగుతున్న ఎన్నికలు అంటూ ఎన్నోసార్లు ప్రస్తావిస్తూ వస్తున్నారు.

కడప నుంచి మదనపల్లి వరకు ఇక్కడ మేమంతా సిద్ధం అనే బహిరంగ సభలను నిర్వహించి.. సీఎం జగన్ మాట్లాడుతూ ప్రస్తుతం వై నాట్ 175 కాదు ఏపీలో డబుల్ సెంచరీ చేయడమే తమ లక్ష్యం అంటూ తెలియజేస్తున్నారు.. ఆంధ్రాలో 175 అసెంబ్లీ స్థానాలు 25 ఎంపీ స్థానాలలో విజయం సాధించాలని ఆశిస్తున్నానంటూ వై నాట్ 200 అనే కొత్త నినాదంతో వెళ్తున్నారు. ఇక 175 అసెంబ్లీ స్థానాలలో 25 ఎంపీ స్థానాలలో తమదే హావ కొనసాగాలని.. దీనిని టార్గెట్గా పెట్టుకున్నారు సీఎం జగన్.. పేద ప్రజలకు సంక్షేమ పథకాలను దూరం చేయడమే చంద్రబాబు తెలివి అని.. టిడిపి , జనసేన అందుకోసమే కలిశారంటూ ఏపీ సీఎం తెలిపారు.

అంతేకాకుండా సీఎం జగన్ సమకాలిన అంశాల పైన కూడా ప్రస్తావిస్తూ గత రెండు రోజులుగా వాలంటరీ అంశాల పైన ప్రస్తావిస్తూనే ముందుకు వెళ్తున్నారు..వీటితోపాటు అవ్వ  తాతలకు , దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వారందరికీ ఇంటి వద్దకే పింఛన్ పంపిస్తుంటే.. ఈసీకి ఫిర్యాదు చేయించి అడ్డుకున్నారనే విధంగా తెలియజేస్తున్నారు. వీటితోపాటు చంద్రబాబు అధికారంలోకి వస్తే పింఛన్లు తొలగిస్తారని.. మొత్తంగా చూసుకుంటే జగన్ ఏ రోజుకు ఆరోజు తాజా ప్రసంగాలతో దంచి కొట్టేస్తున్నారని చాలా క్లియర్ గా కనిపిస్తోంది. మరి ఎంతవరకు ఇవన్నీ జగన్ సక్సెస్ కి కారణమవుతాయో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: