ఏపీ: తక్షణమే ఆ పోలీసులను విధులనుండి తొలగించండి: టీడీపీ

Suma Kallamadi
ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఏపీలో రాజకీయం అట్టుడుకుతోంది. ఇరు పార్టీ నేతలు తమదైన రీతిలో విమర్శనాస్త్రాలు విసురుకుంటున్నారు. ఓ వైపు అధికార పార్టీ వైసీపీ పందులే గుంపుగా వస్తాయి... సింహం సింగల్ గా వస్తుంది అని సినిమా డైలాగులు కొట్టగా, మరోవైపు ప్రతిపక్ష అలియన్స్ టీడీపీ, జనసేన, బీజేపీ కలిపి ఆంధ్రాని ఉద్ధరించడానికే మేము కలిసాం అని డైలాగులు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే తెలుగుదేశం నేత టీజీ భరత్ కర్నూలులో టీడీపీ నేతలపై పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఓ ప్రెస్ మీట్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నేతలను కౌన్సిలింగ్‌ పేరుతో పోలీసులు ఫోన్ చేసి పిలిచి మరీ విచక్షణా రహితంగా కొట్టి పంపించారని మండిపడ్డారు. దానికి గల కారణం చెప్పాలని కర్నూలు భరత్ డిమాండ్ చేశారు. అంతే కాకుండా అటువంటి దుశ్చర్యకి పాల్పడిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
తమ పార్టీ నేతలపై ఎలాంటి కేసులు, రౌడీ షీట్లు లేకపోయినా వారిని ఉద్దేశ పూర్వంగా అరెస్టు చేసి మరీ చేయిచేసుకున్నారని భరత్‌ ఆరోపించారు. దీనిపై సరైన సమాధానం ఇవ్వకపోతే విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకు వెళ్లడంతో పాటు హైకోర్టును కూడా ఆశ్రయిస్తామని ఈ సందర్భంగా భరత్ తీవ్రస్థాయిలో హెచ్చరించడం జరిగింది. ఇలాంటి ప్రభుత్వాన్ని మళ్లీ ఎన్నుకుంటే రాష్ట్రంలో ఇదే అరాచక పాలన కొనసాగుతుందని, అది ఆంధ్ర ప్రజలకు మంచిది కాదని, దయచేసి రాష్ట్ర ప్రజలు ఇలాంటి విషయాలు పరిగణనలోకి తీసుకొని ఎన్నికల్లో వ్యవరించాలని సూచించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దాడి చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తి లేదని మండిపడ్డారు. ఇక పోతే సరిగా రెండు రోజుల ముందు కూడా తెలంగాణ పోలీసులు రాయలసీమకు చెందిన టీడీపీ నేత ఇంటికి వెళ్లి అక్కడ పెద్ద డ్రామా క్రియేట్ చేసిన సంగతి విదితమే. భూ వివాదం కేసు పేరు చెప్పి తమ వెంట రావాలని కోరగా ఈ కేసులో తనకు నోటీసు ఇవ్వాలని శివానందరెడ్డి కోరడం జరిగింది. అయితే శివానందరెడ్డి విషయం తెలియడంతో ఆయన ఇంటికి టీడీపీ కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. టీడీపీ నంద్యాల లోక్‌సభ నియోజకవర్గ ఇంఛార్జ్‌గా ఉన్న మాండ్ర శివానందరెడ్డి.. ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. మరి ఈ కేసులో తెలంగాణ పోలీసులు ఎలా ముందుకు వెళతారన్నది వేచి చూడాలి!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: