చంద్రబాబుకు థ్యాంక్స్ చెప్పిన వైస్సార్సీపీ... ఎందుకో తెలుసా?

Suma Kallamadi
ఆంధ్ర రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల గడువు దగ్గర పడడంతో పింఛన్ల పంపిణీ వ్యవహారం అనేది ఇపుడు ఇరు పార్టీలవారికి మంచి ప్రచార అస్త్రంగా మారింది అనడంలో సందేహమే లేదు. అవును, ఈ వ్యవహారాన్ని ఆసరా చేసుకొని ఇపుడు అధికార పార్టీ వైస్సార్సీపీ పార్టీ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీని ఇరకాటంలో పెట్టడానికి ట్రై చేస్తోంది. దాంతో ఆ పార్టీ ఈ విషయమై వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చినట్టు కనబడుతోంది. ఇక అదే సమయంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్‌పైన టీడీపీ ఎదురుదాడికి దిగుతోంది అనడంలో సందేహమే లేదు.
విషయం ఎక్కడ మొదలైంది అంటే? రాష్ట్రంలో వాలంటీర్ల ద్వారా పింఛన్లను పంపిణీ చేసే కార్యక్రమాన్ని అడ్డుకోవాలని కోరుతూ రాష్ట్ర మాజీ ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాసిన తరువాతే ఈ పరిణామాలు రాజకీయ వాతావరణాన్ని హీటెక్కించాయి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖని ఉద్దేశించి కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం అధికారులు సానుకూలంగా స్పందించారు. ఈ క్రమంలోనే వలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీని నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దీనితో యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలను చేపట్టడం జరిగింది. ఇంటింటికీ వెళ్లి పింఛన్ మొత్తాన్ని ఇవ్వడానికి బదులుగా సచివాలయం వద్ద ఆ మొత్తాన్ని పంపిణీ చేసే ఏర్పాట్లు తీసుకుంది.
ఇక్కడే మొదలైంది అసలు రచ్చ. సోషల్ మీడియాలో ఈ వ్యవహారంపైన పెద్ద ఎత్తున టీడీపీపైన వ్యతిరేకత వస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో తెలుగుదేశం ఇంటి వద్దకే వెళ్లి పింఛన్లను అందజేయాలని డిమాండ్ చేయడం కొసమెరుపు. ఈ మేరకు టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఇప్పటికే 2 సార్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డికి లేఖ రాయడం జరిగింది. ఈ క్రమంలో చంద్రబాబు.. చేసిన ట్వీట్ల స్కీన్ షాట్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. తన అధికారిక అకౌంట్‌లో పోస్ట్ చేసి మరీ వాలంటీర్ల విలువ తెలియజేసినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపింది. అయిదు సంవత్సరాల జగన్ ప్రభుత్వ హయాంలో ఒక్క సచివాలయాల వ్యవస్ధ ద్వారానే 1.26 లక్షల ఉద్యోగాలు కల్పించామని పునరుద్ఘాటించింది వైసీపీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: